ALLAHABAD - PRAYAGRAJ
ll గంగా యమునా సరస్వతిll
సంగమ ప్రాంతాన్ని అలహాబాదు, సంగమము - ప్రయాగ తీర్థ రాజము - త్రివేణి సంగమము, అని అనేక పేర్లతో పిలుస్తారు. ఇక్కడ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళా, ఆరు సంవత్సరములకు ఒకసారి
అర్థ కుంభమేళా, అదేవిధంగా ప్రతి సంవత్సరం శివరాత్రికి ముందు మాఘ మాసంలో మాఘ మేళా ఇక్కడ జరుగుతుంది.
మాఘ మేలా కుంభమేళ అర్థ కుంభమేళా పేర్లు వేరైనా ప్రతి సంవత్సరం దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న సాధువులు సంతు మహా పురుషులు, పీఠాధిపతులు కుంభమేళా సమయంలో అనగా ప్రతి సంవత్సరము మాఘ మాసంలో ఇక్కడ త్రివేణి సంగమ స్నానమాచరించి పుణ్య కార్యక్రమాలను చేసి ధార్మిక ప్రవచనములు ధార్మిక సభల నిర్వహణ అనేకానేక ధార్మిక సన్మార్గ ఉత్సవములు ఇక్కడ నిర్వహిస్తారు.
మాఘ మాసం అంతా ఇక్కడ పర్వము, జాతర, ఉత్సవము జరుగుతుంది.
సంగమ స్నానము - గంగా యమునా సరస్వతి మూడు నదుల సంగమ స్థలి యందు తీర్థయాత్రికులు భక్తులు ఉదయం సంధ్యాసమయం మొదలు సాయం సంధ్య వరకు పుణ్య నదీ స్నానము సంకల్పము నదీ పూజ ఇత్యాదులు సంగమ స్థలి యందు నిర్వహిస్తారు తగిన ఏర్పాట్లు అన్ని సంగమ స్థలి యందు ప్రతిరోజు చేయబడి ఉంటాయి యాత్రికుల రక్షణార్థం నదీ పరివాహక రక్షణ దళం 24 గంటలు గస్తీ నిర్వహిస్తూ ఉంటారు.
పితృ కార్యములు....
సంగమ స్థలి యందు నదీ తీరంలో క్షేత్ర పురోహితుల చేత ప్రతి నిత్యము శ్రాద్దాది కర్మలు ఆస్తి నిమజ్జన కార్యక్రమాలు మరియు దైనిక మాసిక వార్షిక కార్యక్రమములు క్షేత్ర పురోహితులు ఇక్కడ ప్రతి నిత్యము నిర్వహిస్తుంటారు.
ఈ శక్తిపీఠం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఈ శక్తి పీఠము సతీదేవి యొక్క కుడి చేయి పడిన ప్రదేశము.
ఇక్కడ అమ్మవారి కి ఎటువంటి విగ్రహారాధన ఉండదు. అమ్మవారి చేయబడిన ప్రదేశము బావిగా ఉన్నది ఈ బావిలోని జలము భక్తులకు ప్రసాదంగా ఇవ్వబడుతుంది. మరియు భక్తుల నివేదనలన్నీ బావిలో ఉన్న అమ్మవారికి సమర్పించ బడుతున్నాయి.
మాధవేశ్వరి అమ్మవారికి వస్త్రములు ఒడి బియ్యం నారికేళ ఫలము సింధూరము ఇత్యాది మంగళ ద్రవ్యములు అమ్మవారికి భక్తులు సమర్పిస్తారు.
త్రివేణి సంగమం నదీ తీరంలో ఒక దివ్యమైన బడా హనుమాన్ మందిరం ఉన్నది.
రామాయణ కాలంలో హనుమంతుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు అని ప్రతీతి.
ఒకానొకప్పుడు ఔరంగజేబు నవాబు ఈ హనుమ ప్రతిమను తొలగించడానికి ప్రయత్నించినప్పుడు హనుమంతుడు తవ్వేకొద్దీ లోపలికి వెళ్ళిపోయాడు ఔరంగజేబు సైనికులు అలిసిపోయి వెనుతిరిగారు
తత్కారణంగా మహిమాన్వితమైన ఈ బడా హనుమాన్ మందిరం ప్రతి సంవత్సరం సంగమ జలము స్వామి హనుమను త్రాకిన తర్వాత శాంతిస్తుంది.
బడా హనుమాన్ మందిరము దర్శనీయ స్థలం.
కాశీ నుండి త్రివేణి సంగమము (అలహాబాద్ ) మరియు ప్రయాగరాజ మనవడే ఒకరోజు యాత్ర.
యాత్రా విధానము.
కాశీ క్షేత్రం నుండి తెల్లవారుజామున 4 నుండి 5గంటల మధ్యలో బ్రహ్మీ ముహూర్తంలో బయలుదేరుతాము.
వింధ్యాచలము :-
అగస్త్యుడు వింధ్యాచల పర్వతముపై వింధ్యవాసిని అయిన గాయత్రి అమ్మవారిని ప్రతిష్టించిన ప్రదేశము.
మొదటగా వింధ్య వాసిని అమ్మవారిని దర్శించుకుని
ఆ తరువాత సీతామడి సీతమ్మవారు భూమిలోకి వెళ్లిన ప్రదేశాన్ని చూసి అక్కడ నుండి బయలుదేరుతాము.
సీతామడి అనగా రామాయణ కాలం నాటి వాల్మీకి ఆశ్రమ ప్రదేశము.
రామాయణంలో సీతా అమ్మవారు అవతార పరిసమాప్తి చేసిన ప్రదేశము.
అప్పుడు ఇక్కడ వాల్మీకి ఆశ్రమము ఉన్న ప్రదేశం లో సీతమ్మ భూమిలోకి వెళ్లిన ప్రదేశాన్ని సీతామడి అని పిలుస్తారు.
ప్రాంతీయులు సీతామాడి ప్రదేశాన్ని సీతామరిహి అని పిలుస్తారు.
త్రివేణి సంగమము (అలహాబాద్ ) మరియు ప్రయాగరాజము ఇవన్నీ ఒకే ప్రదేశానికి ఉన్న వేరువేరు పేర్లు.
అలహాబాద్ లేక ప్రయాగరాజములో చూడవలసిన ప్రదేశములు :-
వరుసగా మొదట త్రివేణి సంగమ స్నానము
తరువాత గంగా పూజ పితృ కార్యములు దైవ కార్యములు అటుపిమ్మట దంపతులుగా వచ్చిన వారు చేయించుకునే వేణిదానము వేణిపూజ ఇత్యాది పూజా కార్యక్రమములు అన్నియు త్రివేణి సంగమ స్థలి సంగమ తీరంలో బ్రాహ్మణుల చేత చేయించుకోవలెను.
కాశీకి వచ్చే యాత్రికులు కాశీలో ఉన్న గంగాజలము ఇంటికి తీసుకొని పోరాదు
యాత్రికులు అందరూ త్రివేణి సంగమస్థలి అయిన త్రివేణి సంగమం నుంచి మాత్రమే గంగాజలమును మీ ఇంటికి పూజల కొరకు ఇంకా రామేశ్వరంలో శివాభిషేకానికి తీసుకెళ్లవలెను. ప్రయాగలోని తీర్థ రాజ జలమునే పూజలు అభిషేకములు మొదలైన శుభకార్యములకు వాడుతారు.
ఈ విధంగా పూజాధికములు అన్ని పూర్తయిన తర్వాత సంగమస్థలి నుండి బయటకు వచ్చే దారిలో
బడా హనుమాన్ అనగా బడా హనుమాన్ మందిరము ఉన్నది దర్శనీయ స్థలము.
ఇక్కడ నుండి ఆనంద్ భవను అనగా నెహ్రూ ఇల్లు ఉన్నది ఇది కూడా దర్శనీయ స్థలము. ఇది ఒక మ్యూజియం. సాయంత్రం నాలుగు వరకు మాత్రమే తెరిచి ఉంటుంది సోమవారము సెలవు. (ఈ మధ్యకాలంలో ఆనంద్ భవన్ ను ఎవరు దర్శించడం లేదు). యాత్రికుల ఇష్టము.
ఇక్కడి నుండి మాధవేశ్వరి శక్తిపీఠము మాధవేశ్వరీ శక్తిపీఠ దర్శనము చేసుకుంటాము.
ప్రయాగలో వేణి మాధవ దేవాలయము కూడా ఉన్నది.
ఎవరైనా వేణి మాధవ గుడికి వెళ్లదల్చుకున్నవారు తప్పనిసరిగా మాధవేశ్వరి శక్తిపీఠ దర్శనము తర్వాత అక్కడి నుండి నడకదారిలో నడిచి వెళ్లి దర్శించుకుని రావలెను.
వేణి మాధవ గుడి దారి సన్నని వీధి ఇందులోకి పెద్ద వాహనములు వెళ్ళవు.
కావున యాత్రీకులు వారు స్వయంగా మాధవేశ్వరి శక్తిపీఠ దర్శనం అయిన వెంటనే వేణిమాధవ్ గుడికి అక్కడ ఉన్న ప్రాంతీయులను అడిగి తెలుసుకుని వెళ్లి రావలెను.
ఇంతటితో ఒకరోజు కాశీ నుండి ప్రయాగరాజము అనబడే అలహాబాద్ యాత్ర సంపూర్ణం.
ఇది యాత్రీకులు సాధారణంగా చేసే యాత్రా పద్ధతి.
ఇట్టి యాత్రలో మీరు తెల్లవారుజామున నాలుగు నుండి ఐదు గంటల మధ్యలో బయలుదేరినారు రాత్రి మీరు కాశీకి వచ్చేసరికి సమయం 9 నుండి 10:00 గంటలు అవుతుంది.
ఇంకా ఏవైనా పూజలు చూడవలసిన ప్రదేశములు ఉన్నచో మీరుగా తెలుసుకొని వెళ్లి రండి.

😊😊nice
రిప్లయితొలగించండి