ఉత్తర భారత కాశీ యాత్రా సమాచారము వివరములు.


మహానుభావులు, ఋషులు, అఘోరాలు,పండితులు, పామరులు, దేవతలు, భూతములు, అసురులు, పితృదేవతలు, గాణాపత్యులు,శైవులు, శాక్తేయులు, సౌరమానులు, వైష్ణవులు, సాధకులు, సాధువులు, ఇలా సకల జగత్తు సేవించుకునే దర్శించుకునే పరమపావన పుణ్యక్షేత్రం కాశీపురి.



  కాశీ  క్షేత్రములో 

నడచి మరియు వాహనముల ద్వారా చూసే ఆలయముల                          వివరములు.


1. కాశీ విశ్వనాధ మందిరం.   
2.  కాశీ అన్నపూర్ణేశ్వరి.
3.కాశీ విశాలాక్షి మందిరము. 
4. 64 ఘాట్ల సందర్శనము.
5.గంగా హారతి. 
6.చింతామణి గణపతి ఆలయం. 
7.కేదారేశ్వర  మందిరము.
8.తిలాభాండేశ్వర  మందిరము.
9. శ్రీ రాజరాజేశ్వరి ఆలయం {శ్రీ చక్ర నిలయం}.
10.వారాహి మందిరము.
11.కాలభైరవ ఆలయం. 
12.సారనాథ్ బుద్ధ మందిరము.
13. వ్యాస కాశీ {కాశీ రాజు గారి కోట.}
14.బిర్లా మందిరము. {విశ్వనాధ మందిరం}
15.సంకటమోచన హనుమాన్ మందిరము.
16.తులసీ మానస మందిరం.
17.దుర్గా మందిరము.
18.కౌడీ బాయ్ {గవ్వలమ్మ గుడి}.

                              గర్భా వాస దోష నివృత్తి కొరకు ప్రతి వారు పది నెలల కాశీ వాసము చేయదగినది.
కాలక్రమంలో పది నెలల కు బదులుగా సూక్ష్మ విధానంలో సకల జనులు ఆమోదయోగ్యమైన రీతిలో  నేటి కాలమాన పరిస్థితుల్లో సమయాభావం చేత తక్కువ సమయం కలిగిన వారందరూ పది రోజులు తొమ్మిది నిద్రలు కాశీ వాసముతప్పనిసరిగా చేస్తున్నారు.



                     ఈ పది రోజుల్లోనే కాశీలో 9 నిద్ర లతో పాటుగా దగ్గర్లోని ఇతరములైన 
అయోధ్య, ప్రయాగ రాజము {అలహాబాదు} - 
 గయా క్షేత్రం {బుద్ధగయ}, వింధ్యాచలము, సీతా మడి, 
పంచ క్రోశీ యాత్ర, మార్కండేయ పురము, మొదలగు 
లఘు యాత్రలతో పాటుగాసంపూర్ణ  కాశి యాత్రను  యాత్రికులు తరచుగా చేస్తుంటారు.

              ఇది ప్రస్తుత సమకాలీన యాత్ర విధానం.

             కాశీ లో చూడదగిన ఇతర వివరములు.
1.పంచ క్రోశీ యాత్ర.
2.అష్ట భైరవ దర్శనం.
3.ద్వాదశాదిత్యులు దర్శనం.
4.బిందు మాధవుడు.
5.మణికర్ణికా ఘాట్.
6.దుండి రాజ గణపతి.
7.దండపాణి భైరవుడు.
8.పంచ గంగా స్నానము.
9.మణికర్ణికా స్నాన ము.



  II హర హర మహాదేవ II

  సంపూర్ణ ఉత్తరభారత కాశీ యాత్ర వివరాలు

 ll అయోధ్య ll

ll శ్రీరామ జన్మభూమి. ll

అయోధ్యలో చూడదగిన ప్రదేశములు...........
1.సరయూ నదీ స్నానము.  2. శ్రీ రామ జన్మభూమి హనుమాన్ గుడి.
దీన్నే హనుమాన్ గడి అని కూడా అంటారు.
అదేవిధంగా 

3. శ్రీరామ పట్టాభిషేకం జరిగిన ప్రదేశము.
4. సీతమ్మ వంట  శాల  దీన్నే పాకశాల అని అనవచ్చు.
5. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసిన ప్రదేశం.
6. ఇంకా రాముడు నడయాడిన అనేక ప్రదేశములను ఇక్కడ చూడవచ్చును.
త్రేతాయుగంలో రాముడు భరతావనిని పరిపాలించిన భారత రాజధాని.
రఘు రాముడు నడయాడిన పవిత్ర భూమి.
శ్రీ రామ నామం అమృతం వలె ప్రతిధ్వనించిన అమృతమైయిన  నేల...............

II శ్రీరామ శ్రీరామ శ్రీరామ II



గయా క్షేత్రము

  గయా - బుద్ధగయ. 

బీహార్.

శ్రీమన్నారాయణుడు గయాసుర సంహారము జరిపిన ప్రదేశం. 

పూర్వకాలంలో గయాసురుడు అనే అసురుని నుంచి భగవానుడైన శ్రీమన్నారాయణుడు లోకాన్ని కాపాడటం కొరకు అతని నెత్తిపై తన పాదం మోపి నేలలోకి అణగదొక్కి లోకాలను కాపాడినాడు.
గయా క్షేత్రములో దర్శించ దగిన ప్రదేశములు.
మంగళ గౌరీ - అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.
ఫల్గుణీ నది.
వట వృక్షము.
విష్ణుపాదము.
బుద్ధగయ - బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశము.
బుద్ధగయ లో అనేక బౌద్ధారామాలు ఉన్నవి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల తరఫున
అనేకములైన బౌద్ధారామాలు ఉన్నవి
ఇందులో ముఖ్యంగా బుద్ధునికి జ్ఞానోదయం అయిన బోధివృక్షమును  అందరూ తప్పక దర్శిస్తారు.

             

ll ప్రయాగరాజము ll

అలహాబాదు కుంభమేళా జరుగు ప్రదేశం.

అలహాబాదులో దర్శించ తగిన ప్రదేశములు

గంగా యమునా సరస్వతి సహిత త్రివేణి సంగమము.
అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మాధవేశ్వరి శక్తి పీఠం.
బడా హనుమాన్ అని పిలువబడే హనుమాన్ మందిరము.
నెహ్రూ గారి ఇల్లు ఆనంద్ భవన్ గా ప్రసిద్ధి చెందినది.
త్రివేణి సంగమం వద్ద యాత్రికులు అందరూ
తమ యాత్రలో భాగంగా
మన మన లేక తమ తమ పెద్దలైన
పూర్వీకుల అందరికీ
శ్రద్ధతో శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు.
త్రివేణి సంగమమునకు 
దంపతులుగా దర్శనార్థులుగా వచ్చిన దంపతులు
వేణి దానము అనగా దంపతులుగా చేసే వేణీ పూజ చేయించుకుంటారు.
మాధవేశ్వరి అమ్మవారికి
ఒడిబియ్యం పోయడం మన తెలుగు వారి సంప్రదాయం.


                        సీతా మడి

సీతా మడి లేక సీతా మర్హి అన్న పేర్లతో పిలువబడే సీతా మడి దర్శనీయ స్థలం.
సీతా మడి దగ్గర అతి పెద్దదయిన ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది.
రామాయణ గాథ లో చెప్పబడిన విధంగా........
వాల్మీకి మహాముని ఆశ్రమము గంగానది ఒడ్డున ఇక్కడే ఉండేది ఇక్కడే లవకుశులు జన్మించారు. ఇక్కడే సీతమ్మ తల్లి అవతార పరిసమాప్తి చేసినారు. 
సీతమ్మవారు భూమి లోపలికి ప్రవేశించిన ప్రదేశాన్ని ప్రస్తుతం
సీతా మడి గా పిలుస్తారు.


వింధ్యాచలము.
త్రికూటాచల యాత్ర
వేదం లో త్రికూటాచలం గురించి చెప్పబడ్డది.
ఇందులోంచి వింధ్యాచలము కూడా ఒకటి
పూర్వకాలంలో వింధ్యుడు అనబడే వింధ్య పర్వతుడు
తనకున్న  బలం చేత ఆకాశం వైపు గా పెరుగుతున్నాడు.
ఒకానొకప్పుడు ఆ విధంగా పెరిగిన వింధ్య పర్వతం  వలన
లోకంలో సూర్యోదయం సూర్యాస్తమయాలు ఆగిపోయినవి.
అప్పుడు దేవతలందరూ అగస్త్యమహాముని వద్దకు వచ్చి ప్రార్థించగా
అగస్త్య మహాముని వారు వచ్చి వింధ్య పర్వతమును శాంతింపజేసి
అక్కడ వింధ్య వాసిని గా గాయత్రి అమ్మవారిని ప్రతిష్టించారు.
అప్పటి వింధ్య వాసిని అమ్మవారిని మనము దర్శించుకుంటాము.

శ్రీకృష్ణ పరమాత్ముని పుట్టుక ఆవిర్భావ సమయంలో
యశోదాదేవి గర్భంలో యోగమాయగా జన్మించిన
మహామాయ కృష్ణ సహోదరి అయిన అమ్మవారు
జన్మించిన తర్వాత  మాయ గా మారి కంసుని హెచ్చరించిన పిదప
ఈ త్రికూట పర్వతం లో ఒకటైన పర్వతంపై వసించి ఉన్నది.
ఇట్టి యోగమాయ దర్శనము చేసి మనం కూడా తరిస్తాము.


పంచ క్రోశీ యాత్ర.
ఇట్టి యాత్ర ఎంతో భక్తిప్రపత్తులతో ఉపవాసముండి దినమంతా చేయవలసినది.
పంచక్రోశి యాత్ర అనగా శివుడు తన త్రిశూలంతో పైకిఎత్తి ఉంచిన ఐదు క్రోసుల దూరంలో   విస్తరించిన పంచ క్రోశాఆత్మక
 భూ భాగము.
ఇట్టి పంచక్రోశీ  యాత్ర  అస్సీఘాట్ మీదుగా మండ్వాడి
 నరియా ఖండ్వా రామేశ్వర్ శివపూర్ పంచపాండవ భీమ చండి ఆశాపూర్ జవేశ్వర్ అనబడే ప్రాంతాల మీదుగా సాగుతుంది.
ఈ యాత్ర పొద్దున్న బయలుదేరితే సాయంత్రం తో ముగుస్తుంది.
ఇట్యాట్టి   గిరిప్రదక్షణం తో ఇది సమానం.
ఒక విధంగా గిరిప్రదక్షిణ మాదిరిగా పంచక్రోశి యాత్ర పంచక్రోశాత్మక శివుని త్రిశూలం పై ఉన్న శివ నగరాన్ని చుట్టి తిరిగి రావడం అవుతుంది.

మార్కండేయ పురము.
మార్కండేయ మహాముని -  ఋషి తపస్సుచేసిన ఆచరించిన ప్రదేశము దర్శనీయ స్థలము.

కాశీలో చూడదగిన ప్రదేశములు.
కాశి విశాలాక్షి అమ్మవారి ఆలయము అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.
కాశీ అన్నపూర్ణ అమ్మవారి ఆలయము.
వారాహి దేవి మందిరము.
కాశీ విశ్వనాధ విశ్వేశ్వర జ్యోతిర్లింగ దర్శనము.
ద్వాదశ జ్యోతిర్లింగములలో ఒకటి.
గంగా హారతి ప్రతిరోజు సాయంత్రం జరుగుతుంది (సంధ్యాసమయంలో).
కాశీ లో అతి ప్రాచీనమైన గంగా నది ఒడ్డున ఉన్న 84 ఘాట్లు కలవు.
చింతామణి గణపతి.
కేదారేశ్వర మందిరము.
వ్యాస కాశీ .
బిర్లా మందిరము - BHU.
గవ్వలమ్మ దేవాలయము.
దుర్గా మాతా దేవాలయము.
సారనాథ్ బుద్ధ మందిరము బుద్ధుడు మొట్టమొదటగా ప్రవచనం చెప్పిన ప్రదేశము.
కాళభైరవ మందిరము.
తిలా బండేశ్వర ఆలయము.
శ్రీ రాజ రాజేశ్వరి ఆలయం. (శ్రీ చక్ర మందిరము)

ఇవి కాకుండా కాశి క్షేత్రం లో చూడదగిన అనేక ప్రదేశములు నిడచి చూడవలసినవి ఆటోలలో ప్రయాణించి చూడదగినవి అనేకం ఉన్నవి.

ద్వాదశాదిత్యులు.

 ద్వాదశ జ్యోతిర్లింగములు.

అష్టాదశ శక్తి పీఠములు.

అష్ట భైరవ యాత్ర.

అష్ట గణపతుల యాత్ర.



పంచ గంగా స్నానములు.
మణికర్ణికా స్నానము.
అకార ఉకార మకార అనబడే ఓంకార ఆలయములు.
ఇలా కాశి క్షేత్రం లో చూడదగిన అనేక ప్రదేశములు ఉన్నవి.

సాధారణంగా యాత్రికుల అందరికీ చూపించ తగిన చూడవలసిన యాత్రను పూర్తి చేయిస్తాము.

పురాణములు స్కాంద పురాణము మరియు కాశీఖండము ప్రకారంగా కాశీలో తొమ్మిది నెలల తొమ్మిది రోజుల తొమ్మిది ఘడియలు అనగా పది నెలల కాశీ వాసము ప్రతివారు దంపతులు పూర్తి చేస్తారు లేదా అంటే దంపతులుగా లేని వారు ఒక్కొక్కరుగా అయినా సరే ఈ కాశీవాసమును పూర్తి చేస్తారు.

అయితే కాలక్రమంలో గర్భవాస దోష నివృత్తి కొరకు పది నెలల కాశీ వాసము చేయవలెనని ఉన్నప్పటికీ కాలక్రమంలో ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రతి వారు కనీసం పది రోజులు పూర్తి చేస్తున్నారు.
ఈ విధంగా గర్భవాసం దోష నివృత్తి కొరకు పది నెలల 
కాశీ వాసము గడప వలెను.
ఈ విధంగా చేయదగిన యాత్ర కొరకు పది రోజులు 
తొమ్మిది నిద్రల కాశీ వాసము తో  కూడిన 
పూర్తి 12 రోజుల యాత్రను ప్యాకేజీగా చేస్తున్నాము.

నాకు ఉన్న పరిజ్ఞానంతో  నాకు తెలిసిన అనుభవం లో ఉన్న అన్ని వివరాలను ఇక్కడ పొందుపరచాను .

ఏదైనా ఇతర  వివరాలు కావాల్సి  వస్తే తప్పక నన్ను ఫోన్ కాల్ యందు గాని స్వయంగా గాని సంప్రదించగలరు.











కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్యాకేజీ యాత్ర @17000/-

మహాలయ పక్షము 2025

🙏 దక్షిణ భారత తీర్థ యాత్ర 🙏 ప్యాకేజ్ @17300/-