గయా క్షేత్రము

                             || గయా క్షేత్రము ||




గయా క్షేత్రము విష్ణుపాదము గా ప్రసిద్ది నొందినది.

పూర్వము శ్రీ మహావిష్ణువు   తన పాదమును గయాసురుడి తలపై మోపినాడు.

గయా క్షేత్రంలో తమ పూర్వీకుల పేరున   అందరూ అనగా భక్తులందరూ
విధిగా తమ పెద్దలకు తీర్థ శ్రాద్ధము నిర్వహిస్తారు.

గయా క్షేత్రమహత్యం ప్రకారంగా పెద్దలు కాలం చేసిన ఏడాది లోపల
           ఇక్కడ అనగా గయా శ్రాద్ధం పనికిరాదు.





కచ్చితంగా పెద్దలు కాలం చేసిన ఒక సంవత్సరం తర్వాత మాత్రమే ఇక్కడి గయా శ్రాద్ధం చేయదగినది.

గయలో విధిగా మూడు చోట్ల వరుసగా
పల్గుణీ నది యందు
 వట వృక్షము మరియు
విష్ణుపాదము దగ్గర  పిండ ప్రధానాది కార్యక్రమములు నిర్వహిస్తారు.
ఇట్టి కార్యక్రమము తీర్థ పురోహితులు
భక్తుల కోరిక మేరకు నిర్వహిస్తుంటారు.
మన సంప్రదాయంలో గయా శ్రాద్ధం విశేషమైనది 
      విశేష ఫలప్రదం.

గయా క్షేత్రమునకు చేరువలో
అనగా గయా గ్రామంలోనే
మంగళ గౌరీ శక్తి పీఠము ఉన్నది.
ఈ శక్తి పీఠము అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.
మంగళ గౌరి కి స్త్రీలు సుగంధ మంగళ ద్రవ్యములను సమర్పిస్తారు
వివాహర్థమై  తమ తమ పిల్లల కొరకు తల్లిదండ్రులు
ఇక్కడ వివాహ సంకల్పాలు చేస్తారు.

మంగళ గౌరీ దర్శనం తర్వాత భక్తులు
బుద్ధగయ అనగా
బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశమునకు చేరుకుంటారు.
ఇక్కడ బుద్ధునికి జ్ఞానోదయం అయిన బోధి వృక్షము కలదు.
ఈనాటికి ఆ వృక్షము సంరక్షించబడుతోంది.

గయకు రాలేని వారి కొరకు గయా శ్రాద్ధము తీర్థ పురోహితుల చేత  కార్యక్రమము నిర్వహింప చేస్తాము. ఇక్కడ అన్నదానము గయా శ్రాద్ధము
చేయదలుచుకున్న వారు మమ్మల్ని సంప్రదించవచ్చు.

అంతే కాకుండా
ప్రయాగ తీర్థ రాజము  అనగా అలహాబాదు
కాశీ క్షేత్రము గంగానది ఒడ్డున
మరియు గయా క్షేత్రములో వరుసగా ఒకే రోజున 
ఓకే తిథిలో మీ మీ పెద్దల కార్యక్రమాలను
మరియు వారి పేరున అన్నదానము విధిగా నిర్వహింప చేయగలము.



 సీతాదేవి శాప కారణoగా ఫల్గుణి నదిలో ఎప్పుడూ నీరుండదు.  వరదలు వచ్చినప్పుడు మాత్రము నదీ జలాల ప్రవాహం గయ లో కొంత కనిపిస్తుంది.
సీతాదేవి వరము వలన గయ ఆలయ ప్రాంగణం లో ఉన్న మర్రిచెట్టు వటవృక్షము నిత్యనూతనంగా శాశ్వతంగా ఉండేటట్లు వరం పొందినది.

గయలో కాయ, పండు, ఆకు విడిచి పెట్టడం.....

 వటవృక్షం క్రింద ఇంద్రియ వాంఛలపట్ల విముఖతకు ప్రతీకగా మనకు అత్యంత ఇష్టమయిన ఒక కూరగాయ, ఒక పండు, ఒక ఆకును వదిలివేయాలి.

భార్యాభర్తలు ఇద్దరు ఒకటే వదలాలి -  వేరువేరు కాదు. వాస్తవానికి "ఆకు, కాయ, పండు" వదలడంలోని ఉద్దేశ్యం విషయ వాసనల పట్ల విరక్తి భావము పెంచుకొని, ఇంద్రియ నిగ్రహము అలవరచు కొనుటకు ఏర్పాటు చేయబడినది. ఇష్టమయిన వాటిపట్ల మమకారములను వదిలివేయుటయే దీని అంతరార్థము.

శ్రద్ధతో చేసేది శ్రాద్ధము అంటారు.
 
గయలో పితృకార్యములు, శ్రాద్ధ విధులు జరిపించడము తప్పనిసరి. ఇందు కొరకు  ముందుగనే మన వంశంలో గతించిన వంశస్థుల, స్నేహితులు, ముఖ్యులు,బంధుత్వాల వారీగా నామగోత్రములతో సహా రాసి దగ్గర ఉంచుకోవలెను.


                       || భక్తులు సంప్రదించగలరు ||







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్యాకేజీ యాత్ర @17000/-

మహాలయ పక్షము 2025

🙏 దక్షిణ భారత తీర్థ యాత్ర 🙏 ప్యాకేజ్ @17300/-