యాత్రా వస్తువులు.

ఉత్తర భారత సంపూర్ణ కాశీ యాత్రలో భాగంగా
యాత్రికులు 
తమ తమ ఇంటి నుండి తెచ్చుకో వలసిన వస్తువులు.

ప్రయాగ రాజములో మాధవేశ్వరీ,
కాశీలో విశాలాక్షి,
కాశీలో అన్నపూర్ణేశ్వరి,
గయా క్షేత్రములో మాంగళ గౌరీ,
అమ్మవార్లకు ఒడిబియ్యం సామాను.

తీర్థయాత్రలో ఖర్చులకు గాను
 పది రూపాయల నోట్లు
5 రూపాయల కాయిన్స్
పెద్ద ఒక రూపాయి బిళ్ళలు దక్షిణ కొరకు.

పండ్లు 
ఇట్టి తీర్థయాత్రలో సహజంగానే ఆపిల్ పండ్లు 
జామ పండ్లు మొదలగు ఫలములు తక్కువ ధరలో దొరుకుతాయి కాబట్టి యాత్రికులు వీటిని తినడానికి ఇష్టపడతారు కావున వెంట ఒక చాకు ఉంచుకోవలెను
తినే పండ్లను కట్ చేసుకోవడానికి.

దేవాలయాలకు వెళ్లి నప్పుడు
శివలింగానికి అభిషేకం నిమిత్తము
గంగా స్నానానికి వెళ్ళినప్పుడు
గంగా స్నానం కోసం
ఒక రాగి చెంబు వెంట ఉంచుకోగలరు.

కాశి యాత్ర లో పది రూపాయల కాయిన్స్
చెల్లుబాటు అవుతాయి.

దేవాలయాలకు వెళ్లినప్పుడు దేవతా కార్య క్రమాలకు
పితృ కార్యములకు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు
సంప్రదాయ వస్త్రాలు ధరించాలి.

ప్రయాగ  రాజము 
అలహాబాద్ త్రివేణి సంగమం లో
వేణీ పూజ చేయించుకోవాల్సిన దంపతులు
నూతన వస్త్రములు ఒక జత దగ్గర ఉంచుకోండి.




అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతున్నది.
రాముని కొరకు
ప్రస్తుత కాలంలో అందరూ ఇస్తున్నట్లుగా ఏవైనా చందాలు ఇవ్వతలచుకుంటే  
ఆట్టి ధనాన్ని విడిగా ఉంచుకోండి.


తప్పనిసరిగా అందరూ జాగ్రత్తగా ఉండాలి.
యాత్రీకులు వెంట యాత్రికుల మాదిరిగా
పలు ప్రాంతాల వాళ్ళు దొంగలు కూడా ప్రయాణిస్తుంటారు.
దొంగలు రద్దీ
 ప్రాంతాల్లో ప్రయాణిస్తున్న యాత్రికులను టార్గెట్ చేస్తారు.
అన్ని చోట్ల  మన వాళ్లు అందుర  ఒక గ్రూపు గా ఉండండి.
      జాగ్రత్తగా ఉండమని చెప్పడం మా ఉద్దేశం.

మన గ్రూపు మనం ఒక గ్రూపుగా ఉండటం వలన
మోసాలకు దొంగతనాలకు గురికకుండా
 మనకు మనమే జాగ్రత్తగా ఉండవచ్చును.

కొత్త వాళ్ళు ఇచ్చే ఆహార పదార్థాలు ప్రసాదాలు
ఏమైనా సరే జాగ్రత్తగా చూసి తినండి
ఏదైనా అనుమానంగా ఉంటే మన రూమ్ కి వచ్చినాక జాగ్రత్తగా పరిశీలించి తినండి.


యాత్రికులకు మత్తు పదార్థాలు తినే పదార్థాల్లో కలిపి ఇచ్చి తరచుగా మోసగిస్తూ ఉంటారు జాగ్రత్త.

గోల్డ్ ఆర్నమెంట్స్ (బంగారు వస్తువులు)
 ధరించి రాకూడదు.







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్యాకేజీ యాత్ర @17000/-

మహాలయ పక్షము 2025

🙏 దక్షిణ భారత తీర్థ యాత్ర 🙏 ప్యాకేజ్ @17300/-