కాశీ యాత్ర 6000/-


సులభంగా కాశీ యాత్ర చేయండి
పది సంవత్సరాల స్వీయ అనుభవజ్ఞులైన యాత్రా నిర్వాహకుల పర్యవేక్షణ లో పూర్తి భక్తి భావంతో
హార హర మహదేవ శంభో శంకరా అంటూ సాగిపోయే 
మోక్షపురి యాత్ర అయిన ఆనందవనమునకు వారణాసి గా పిలువబడుతున్న కాశీ నగరమునకు స్వాగతం
యాత్రలో మీరు చేసే శినామస్మరణ గంగా స్నానము అత్యంత పుణ్య ప్రదమైన శక్తినిచ్చే యోగ మార్గము.



6000/- ప్యాకేజీ వివరములు.

1. సికింద్రాబాద్ నుంచి కాశీ వరకు మరియు కాశీ నుండి సికింద్రాబాద్ వరకు స్లీపర్ క్లాస్ రైల్వే ట్రైన్ టికెట్లు ఇస్తాము.


2. కాశీ క్షేత్రములో  తొమ్మిది నిద్రలు పది రోజులు

వసతి భోజన సదుపాయములు ఏర్పాటు చేస్తాము.

3. ఆహార వివరములు.

ఉదయము టీ, మధ్యాహ్నం భోజనము,

రాత్రికి అల్పాహారము(టిఫిన్).

4. వసతి సదుపాయ వివరములు.

హోటల్ గది - సత్రము - ఆశ్రమము యందు

వసతి ఉండటానికి ఏర్పాటు చేస్తాము.

హోటల్ గది యందు ఒక రూముకు నలుగురు చొప్పున

సత్రము లేక ఆశ్రమముల యందు 

ఒకవేళ హాల్ టైపు ఉన్నచో

హాల్ యందు (తగినంతమంది)హాలు పరిమాణములో ఉండగలిగినంత మందిని  ఉంచుతాము.

5. యాత్రికులు కాశీ కి చేరిన తర్వాత

కాశీ యందు చూడదగిన దేవాలయములు

కాశీ మహత్యం కాశి కి సంబంధించిన ఇతరములైన వివరములు కాశి క్షేత్రం లో ప్రవర్తించవలసిన విధానము దేవాలయ దర్శనం కు సంబంధించిన విషయములు ఇత్యాది వివరములు అన్నిటినీ తెలియజేస్తాము .



6. కాశి క్షేత్ర దర్శనములు

  కాశి క్షేత్రం లో ఉన్న దర్శనీయ స్థలములు అన్నీ తిరగడానికి కావలసిన ఖర్చులు ఎవరి ఖర్చులు వారే భరించు కోవాలి.

7. యాత్రికులకు కావలసిన అన్ని వివరాలను తెలియజేస్తాము

యాత్రలో భాగంగా ఎవరైనా ఇతర యాత్రలు వెళ్లాలనుకుంటే వారికి కావాల్సిన వాహన సదుపాయములు ఏర్పాటు చేస్తాము.

8. ఈ ప్యాకేజీ లో ఉన్న యాత్రికుల అందరికీ రాను పోను ట్రైన్ టికెట్లు మరియు 

కాశీ క్షేత్రములో భోజనము మరియు వసతి

(హోటల్ గది - రూము -  ఆశ్రమము - సత్రము )మాత్రము ఏర్పాటు చేయబడును.


--------------------------------------------------


 దేవాలయంలో పూజలు 

గంగా హారతి

గంగాస్నానము పంచ గంగా స్నానము మణికర్ణికా స్నానము

అష్ట భైరవ యాత్ర కాలభైరవ యాత్ర

పంచ క్రోశ యాత్ర ద్వాదశాదిత్య యాత్ర

పెద్దలకు శ్రాద్ధకర్మలు

కాశి క్షేత్రం లో లోకల్ సైట్ సీయింగ్

క్షేత్రములో నడిచి చూడవలసిన దేవాలయములు

ఇతర ఇతరములైన అన్ని విషయాలు తెలియజేస్తూ మీ యాత్రను పరిపూర్ణం చేయిస్తాము.

మీకు కావలసిన ఏర్పాట్లు కూడా చేయిస్తాము

మీరు ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేయించుకోదలచుకున్న ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయించుకోదలచుకున్న ఏర్పాటు చేస్తాము.


NOTE :

                 ➡️⬇️⬇️⬇️⬇️⬅️

కాశి క్షేత్ర దర్శనములు

యాత్రలో పూజలు ఆలయ tickets ఇతర ఏర్పాట్లకు మరియు 

కాశి క్షేత్రం లో ఉన్న దర్శనీయ స్థలములు అన్నీ తిరగడానికి కావలసిన ఖర్చులు ఎవరి ఖర్చులు వారే భరించు కోవాలి.

యాత్రికులు ఒకరు లేక ఇద్దరు లేక ముగ్గురు

లేక నలుగురు కన్నా తక్కువ ఉన్నచో 

అట్టి యాత్రికులకు  

రాను పోను రైలు టికెట్ల డబ్బులు అదనంగా ఛార్జి చేయబడును.

 

NOTE :

 Below 4 members are charged additional 

for train tickets.(up - down).



🙏🙏🙏🙏🙏
కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, 
తపస్సులు చేసిన పుణ్యంతో పాటు 
అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.
కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.
అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు.
మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా  విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.
గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీ పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది 
ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.
శివుని కాశీలోని కొన్ని వింతలు.
కాశీలో గ్రద్దలు ఎగరవు, 
గోవులు పొడవవు, 
బల్లులు అరవవు, 
శవాలు వాసన పట్టవు, 
కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.
కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ  జాడ దొరకకుండా ఉంటుంది.
కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని 
విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ 
పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు 
దారి లేకుండా చేసినారు.
అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీ లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు. 
అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి?
అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు 
అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.
కాశీ విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు .
కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి 
పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.
కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది; 
పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.
విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.
ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి 
నివాస స్థలం కాశి.
ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన 
అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.
కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.
పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.
కానీ  మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి  ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము. 
విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో 
అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు. 
నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, 
మసీదు వైపు గల కూల్చబడ్డ మందిరం వైపు చూస్తోంది.
అక్కడే శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.
ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిర అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు.

కాశీ స్మరణం మోక్షకారకం..కాశీ..
కాశీ..కాశీ..కాశీ..కాశీ.
స్వస్తి.
ఓం నమః శివాయ.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.

సర్వే జనా సుఖినోభవంతు.
(సేకరణ)
🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్యాకేజీ యాత్ర @17000/-

మహాలయ పక్షము 2025

🙏 దక్షిణ భారత తీర్థ యాత్ర 🙏 ప్యాకేజ్ @17300/-