ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కాశీ యాత్ర at 15000/- Package

యాత్ర ప్యాకేజీ వివరములు/package details

  ll హర హర మహాదేవ                 శంభో శంకర ll




కాశీ యాత్ర ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు 12 రోజులు
ఇలా అనేక రకాలుగా సహజంగా యాత్రీకులకు ఉండే వ్యవధి లేక సమయం లేక వారి వారి టికెట్ల బుకింగ్ ఆధారంగా
వారికి ఉన్న సమయంలో  సరైన  డే   ప్లాన్ /దినచర్యను నిర్ణయించి  తక్కువ సమయంలో ఎక్కువ దర్శనములు
చూడవలసిన ప్రదేశముల సందర్శనములు చేయిస్తాము.





యాత్రకు సహజంగా ఎక్కువమంది పెద్ద వయస్సు వారు వస్తారు  కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకొని ఆయా వయసుల వారికి తగిన విధంగా దేవాలయానికి దగ్గరగా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము.


యాత్రికులకు కావలసిన సౌకర్యాలను వారు ఇంటి నుంచి బయలుదేరి రాకముందే అన్నీ  చర్చించి వారికి కావలసిన రీతిలో  తగిన విధంగా ఏర్పాటు చేస్తాము.

యాత్రికుల అందరికీ 
ఉదయము మరియు సాయంత్రము టీ  
మరియు 
 - రాత్రికి  టిఫిన్ మధ్యాహ్నం భోజనము  ఏర్పాటు చేస్తాము.

యాత్రలో భాగంగా చూడవలసిన అన్ని ప్రదేశాలను  మనకు అర్థమయ్యే   విధంగా చక్కని తెలుగు భాషలో వివరిస్తూ అన్ని ప్రదేశాలను చుపిస్తూ సంపూర్ణ యాత్రను  పూర్తి చేయిస్తాము.

 

                  Package at 15000/-


              ఈ యాత్ర సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మొదలవుతుంది మరియు తిరిగి  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి రావడంతో పూర్తవుతుంది.

                                       యాత్ర పూర్తిగా 12 రోజుల సంపూర్ణ  కాశీ యాత్ర.

తొమ్మిది నిద్రలు పది రోజుల  కాశీ వాస సంపూర్ణ యాత్ర.


                           Travelling

                                 సికింద్రాబాద్ నుంచి కాశీకి,    కాశీ నుంచి తిరిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు స్లీపర్ క్లాస్ ట్రైన్ టికెట్లు కేటాయించబడి తాయి.

కాశీలో  లోకల్ సైట్ సీయింగ్ అంతా బ్యాటరీ ఆటోలు/కరెంట్ ఆటోలలో చేయబడుతుంది.


                    కాశీ - గంగ


 నాస్తి గంగా సమం తీర్థం కలికల్మషనాశనం ll 

 నాస్తిముక్తి ప్రదం క్షేత్రం అవిముక్తం సమంహరే ॥


కలిదోషాల్ని పరిహరించటంలో గంగానదితో సమానమైన తీర్థం మరొకటి లేదు. అలాగే ముక్తిని ప్రదానం చేసే దివ్యక్షేత్రాలలో అవిముక్త క్షేత్రాన్ని మించిన క్షేత్రం లేదు.


గంగానదిలో తిథివార నక్షత్ర నియమాలు లేకుండానే స్నానం చేయవచ్చు.


కాశిలో ఉన్న గంగని సేవించినవాడు, గంగా దేవికి మందిరాన్ని నిర్మించినవాడు సమస్త సుఖభోగాల్ని పొందుతాడు.


గంగాదేవిని స్మరించినా, ఆమె మహిమని విన్నా, వినిపించినా వారికి గంగాస్నానఫలం దక్కుతుంది.


 పితృదేవతల్ని ఉద్దేశించి వారి పేర్లు స్మరిస్తూ గంగలోని నీళ్ళతో ఏ శివలింగానికి అభిషేకం చేసినా, వారి పితరులకి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి.


గంగాజలంతో సూర్యుడికి అర్ధ్యాలు సమర్పిస్తే ఆరోగ్యం పెంపొందుతుంది. 

గంగాస్నానం చేసే వారిజోలికి యమదూతలు ఎప్పుడూ రారు.


 కాశీలోని గంగా తీరంలో గోదానం, భూదానం, సువర్ణదానం, అన్నదానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు.


 మకరసంక్రమణం, ఉత్తర, దక్షిణాయనాలు, సూర్య చంద్రగ్రహణాలు తదితర పర్వదినాలలో కాశీగంగలో చేసే స్నానం అనంతమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది.




  స్కాంద పురాణంలోని మంత్ర రాజము.


జ్యేష్ఠమాసే సితే పక్షే దశమీ హస్త సంయుతా ll 

తస్యాం దశమ్యాంమే తచ్చ స్తోత్రం గంగాజలే స్థితః ॥ 


 జ్యేష్ఠమాసం శుద్ధ దశమీ హస్తానక్షత్రం ఉన్న రోజున గంగాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ రోజు దశహర గంగాస్తోత్రాన్ని శ్రద్ధగా పఠించి గంగాస్నానం చేసిన భక్తులకు పాపాలన్నీ హరించి పోతాయి.



                         యాత్రలో భాగంగా చేయదగిన ఇతర యాత్రలు.

http://dashashwamedha.blogspot.com/2020/10/allahabad-prayagraj.html


                          త్రివేణీ సగమం  అనగా అలహాబాదు/ ప్రయాగ రాజము .



                                     అయోధ్య శ్రీ రామ మందిరము శ్రీరామజన్మభూమి.

         








                     

  గయా క్షేత్రము విష్ణుపాదము.

    

                       



   వింధ్యనివాసిని వింధ్యాచలము.






                                       మొదలగు

 అన్ని ప్రయాణాలు నాన్ ఏసీ బస్సులు మరియు నాన్ ఏసి ఫోర్ వీలర్ వాహనముల ద్వారా చేయిస్తాము.
మీకు అనగా యాత్రికులకు కేటాయించే అద్దె గదులు  కాశీ విశ్వనాథ ఆలయం విశాలాక్షి ఆలయం
గంగా హారతి ఇచ్చే ప్రదేశానికి చేరువలో ఉంటాయి.

యాత్రీకులు  ప్రతిరోజు ఆలయ దర్శనము గంగా హారతి గంగా స్నానము మొదలైన ఆధ్యాత్మిక కార్యక్రమములు ప్రతిరోజు చేసుకోవచ్చు.


    కాలినడక మార్గమంతా నో ఎంట్రీ జోన్.

ఈ కారణంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో వాహనాలకు అనుమతి ఉండదు.
అయితే ఎవరైతే పూర్తిగా నడవలేని స్థితిలో ఉంటారో వారికి వీల్ చైర్ ద్వారా ఈ యొక్క అన్ని దర్శనాలు చేయించబడతాయి. వీల్చైర్ యొక్క ఖర్చులు సొంతంగా భరించవలెను.


యాత్ర లో ఎవరైనా బయటి ఆహారపదార్థాలు అల్పాహారాలు జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఏదైనా పదార్థాల్లో దోషం ఉంటే ఆరోగ్యం చెడుతుంది ఆ కారణంగా ఆహార పదార్థాలు మాత్రం ఎక్కడ ఏవిధంగా ఉన్నా చూసుకొని గమనించి తినాలి.


యాత్రీకులు అందరికీ దేవాలయానికి అతి దగ్గరలో చేరువగా హోటల్  గదులు కేటాయించ బడతాయి.


యాత్రీకులు అందరూ ఆరోగ్య సమస్యలు  అనారోగ్య కారణాలు ఉన్న వాళ్ళు  రోజూ వాడే మందులు అనగా మెడిసిన్స్ విధిగా దగ్గర ఉంచుకోవాలి.


మీకు ఏవైనా ఇతర సౌకర్యాలు వివరాలు ఇంకా ఏమైనా అడగవలసిన విషయాలు మిగిలి ఉంటే దయతో మమ్మల్ని వాట్సాప్ యందు గాని ఫోన్ కాల్ యందు గాని సంప్రదించగలరు.


ప్యాకేజీ కాకుండా మీరు సాధారణ యాత్రికులుగా యాత్ర చేస్తున్నప్పటికీ ఏవైనా అవసరాలు ఉంటే మమ్మల్ని సంప్రదించగలరు మీకు కావలసిన అన్ని సౌకర్యాలను మేము చేసి పెడతాము.

            Mobile no  :   

            99499 19752

         94559 42941



                                                                                          Kaashi - Varanasi  -  Uttar Pradesh.
        # HNO: B.17/53 - 54 C1.
                                                                                                      InThe Residence of BK Lal Yadav
                                                                                                       Main Road -  Pandey Haveli,
                      VARANASI  -  UTTAR PRADESH                                              221010.






మహానుభావులు, ఋషులు, అఘోరాలు,పండితులు, పామరులు, దేవతలు, భూతములు, అసురులు, పితృదేవతలు, గాణాపత్యులు,శైవులు, శాక్తేయులు, సౌరమానులు, వైష్ణవులు, సాధకులు, సాధువులు, ఇలా సకల జగత్తు సేవించుకునే దర్శించుకునే పరమపావన పుణ్యక్షేత్రం కాశీపురి.   

 కాశీ  క్షేత్రములో  నడచి మరియు వాహనముల ద్వారా చూసే ఆలయముల                          వివరములు. 1. కాశీ విశ్వనాధ మందిరం.    2.  కాశీ అన్నపూర్ణేశ్వరి. 3.కాశీ విశాలాక్షి మందిరము.  4. 64 ఘాట్ల సందర్శనము. 5.గంగా హారతి.  6.చింతామణి గణపతి ఆలయం.  7.కేదారేశ్వ ర   మందిరము. 8.తిలాభాండేశ్వర  మందిరము. 9. శ్రీ రాజరాజేశ్వరి ఆలయం {శ్రీ చక్ర నిలయం}. 10.వారాహి మందిరము. 11.కాలభైరవ ఆలయం.  12.సారనాథ్ బుద్ధ మందిరము. 13. వ్యాస కాశీ {కాశీ రాజు గారి కోట.} 14.బిర్లా మందిరము. {విశ్వనాధ మందిరం} 15.సంకటమోచన హనుమాన్ మందిరము. 16.తులసీ మానస మందిరం. 17.దుర్గా మందిరము. 18.కౌడీ బాయ్ {గవ్వలమ్మ గుడి}.                             

 గర్భా వాస దోష నివృత్తి కొరకు ప్రతి వారు పది నెలల కాశీ వాసము చేయదగినది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్యాకేజీ యాత్ర @17000/-

మహాలయ పక్షము 2025

🙏 దక్షిణ భారత తీర్థ యాత్ర 🙏 ప్యాకేజ్ @17300/-