గంగా పుష్కర మహోత్సవం 2023

                 గంగానదీ పుష్కరాలు

ది 21-04-2023 శోభకృత్ వైశాఖ శుద్ధ విదియ

శుక్రవారం రాత్రి గం.4-11 ని.లకు అనగా తెల్లవారితే శనివారం దేవ గురుడు బృహస్పతి గురుగ్రహం తన మిత్ర స్థానమగు అశ్వని 1వపాదం మేషరాశి యందు ప్రవేశించుటచే సార్ద త్రికోటి తీర్ధ సహిత పవిత్ర గంగానదికి 22-04-2023 తేదీ నుండి పుష్కరములు ఆరంభమగును. ఈరోజు నుండి సార్థత్రికోటిదేవతా సహితముగా బృహస్పతి గంగానదిలో వశింతురనుటచే స్నాన దాన తర్పణ పిండ ప్రధానములు చేయుట వలన పితృదేవతలు తరించి కుటుంబ వృద్ధిబడయుదురు. నిత్యం పూజా సమయంలో కలశంలో నీరు ఉంచి “గంగేచ యమునేచైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలస్మిన్ సన్నిధింకురు" కలశంలో గంగాజలం సాన్నిధ్యం అనుభవించినంత మాత్రం చేతనే అంటే కలశారాధన చేసే సమయంలో గంగను స్మరించినంత మాత్రం చేతనే పవిత్రత చేకూరుతుంది.

ఈ నది కాశి, హరిద్వార్, కేథార్నాధ్ బదరీనాథ్, ఋషీకేష్, గంగోత్రి, భగీరధీ, త్రివేణి సంగమం (ప్రయాగ) గయ మొదలగు పుణ్యక్షేత్రాలలో పుష్కర స్నాన మహిమ ఫలితము లభించును.

పుష్కరుడు

పుష్కరుడి అసలు పేరు తుంబిలుడు. లోకకల్యాణ సంకల్పంతో ఆయన చేసిన తపస్సుకు సంతోషించి శివుడు తన అష్ట మూర్తుల్లో ఒకటైన జల మూర్తిలో అతనికి స్థానం కల్పించాడు. అప్పటి నుంచి తుంబిలుడికి పుష్కరుడు అనే పేరొచ్చింది. మూడున్నర కోట్ల పుణ్యతీర్థాలకు ఆధిపత్యాన్ని కూడా పుష్కరుడికే కట్టబెట్టాడు పరమేశ్వరుడు. పుష్కరాలకు కారణంగా చెప్పే కథ ఒకటి మనకు పురాణాల్లో కనిపిస్తుంది. బ్రహ్మ కమండలంలో స్థానం పొందిన పుష్కరుడిని ప్రాణుల రక్షణ కోసం తనకు ఇవ్వమని బృహస్పతి కోరాడు. దానికి పుష్కరుడు సమ్మతించలేదు. దీంతో బ్రహ్మ ఒక ఏర్పాటుచేశాడు. దాని ప్రకారం గ్రహ స్థితిలోని బృహస్పతి మేషం నుంచి మీనం వరకు ఉండే పన్నెండు రాశులలో ప్రవేశించే తొలి పన్నెండు రోజులు, చివరి పన్నెండు రోజులు పుష్కరుడు గురువుతో కలిసి ఉండాలి. అలా గురువుతో పుష్కరుడు కలిసి ఉండే తొలి పన్నెండు రోజులు ఆది పుష్కరాలు అంటారు. చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరాలు అంటారు. పుష్కర సమయంలో ముక్కోటి దేవతలు, మునులు, రుషి గణాలు అంతా పుష్కరాలొచ్చిన నదిలో ఉంటారు.



                         కాశీ - గంగ

 నాస్తి గంగా సమం తీర్థం కలికల్మషనాశనం ll 
 నాస్తిముక్తి ప్రదం క్షేత్రం అవిముక్తం సమంహరే ॥

కలిదోషాల్ని పరిహరించటంలో గంగానదితో సమానమైన తీర్థం మరొకటి లేదు. అలాగే ముక్తిని ప్రదానం చేసే దివ్యక్షేత్రాలలో అవిముక్త క్షేత్రాన్ని మించిన క్షేత్రం లేదు.

గంగానదిలో తిథివార నక్షత్ర నియమాలు లేకుండానే స్నానం చేయవచ్చు.

కాశిలో ఉన్న గంగని సేవించినవాడు, గంగా దేవికి మందిరాన్ని నిర్మించినవాడు సమస్త సుఖభోగాల్ని పొందుతాడు.

గంగాదేవిని స్మరించినా, ఆమె మహిమని విన్నా, వినిపించినా వారికి గంగాస్నానఫలం దక్కుతుంది.

 పితృదేవతల్ని ఉద్దేశించి వారి పేర్లు స్మరిస్తూ గంగలోని నీళ్ళతో ఏ శివలింగానికి అభిషేకం చేసినా, వారి పితరులకి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి.

గంగాజలంతో సూర్యుడికి అర్ధ్యాలు సమర్పిస్తే ఆరోగ్యం పెంపొందుతుంది. 
గంగాస్నానం చేసే వారిజోలికి యమదూతలు ఎప్పుడూ రారు.

 కాశీలోని గంగా తీరంలో గోదానం, భూదానం, సువర్ణదానం, అన్నదానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు.

 మకరసంక్రమణం, ఉత్తర, దక్షిణాయనాలు, సూర్య చంద్రగ్రహణాలు తదితర పర్వదినాలలో కాశీగంగలో చేసే స్నానం అనంతమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది.



  స్కాంద పురాణంలోని మంత్ర రాజము.

జ్యేష్ఠమాసే సితే పక్షే దశమీ హస్త సంయుతా ll 
తస్యాం దశమ్యాంమే తచ్చ స్తోత్రం గంగాజలే స్థితః ॥ 

 జ్యేష్ఠమాసం శుద్ధ దశమీ హస్తానక్షత్రం ఉన్న రోజున గంగాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ రోజు దశహర గంగాస్తోత్రాన్ని శ్రద్ధగా పఠించి గంగాస్నానం చేసిన భక్తులకు పాపాలన్నీ హరించి పోతాయి.


ప్రాణికోటి  మనుగడకు ఆధారం జలం. జలం పుట్టిన తరువాతే జీవకోటి ఉద్భవించింది.జలధారాల వెంటనే తొలుత నాగరికత విస్తరించింది. అలాంటి జలానికి దేవతా రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం సనాతన సంప్రదాయం. అలాగే నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మాఘ స్నానాలు , మంగళ స్నానాలు అని హిందూ సాంప్రదాయం నీటితో ముడి పడి ఉంది. అలాగే తీర్ధయాత్రలు అని పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది. శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు కూడా జలంతో ముడిపడినవే. నదీతీరంలో పితృకర్మలాచరించడం మోక్షదాయకమని పెద్దలు చెప్తారు. పితరులను ఉద్దరించడానికి భగీరథుడు గంగానదిని భూమికి తీసుకు వచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. తిలోదకాలు ఇచ్చామంటే స్వస్తి వాచకం చెప్పడమని లోకోక్తి. నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రథమని హిందువుల విశ్వాసం.
  తైత్తరీయ ఉపనిషత్తు బ్రహ్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి జలం, జలంనుండి భూమి, భూమి నుండి ఔషధులు, ఔషధుల నుండి అన్నం, అన్నం నుండి జీవుడు పుట్టాయని వివరిస్తుంది .ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం స్నానం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు.
గంగా గంగా గంగా
ఈ భూమిపైన భాగీరథి అయిన గంగ అనంత కాలానికి పూర్వము మహా భగీరథ ప్రయత్నము ద్వారా మహావిష్ణు పాదోద్భవి అయిన గంగ బ్రహ్మ కమండలం నుండి పరమేశ్వరుని జటాజూటములమీదుగా ఆకాశమార్గము ద్వారా భూమికి చేరినది.
పోష యతీతి  ఇతి పుష్కరం -  అనగా పోషించేది అని
అర్ధం. సకల నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రదమయినది మరియు శక్తవంతమైన ఫలాలనిచ్చునది అనేది సనాతన వైదిక ధర్మ నిరూపణమ్.
సనాతన ధర్మ విశ్వాసం.











గంగ భూమి మీద ఉన్న సకల జీవులకు మోక్షము ప్రసాదించడానికి పితరులకు శాంతి మృతులకు పితృ లోకం నుండి స్వర్గ ప్రాప్తి ప్రసాదించడానికి భువిలో వెలసిన స్వర్గ లక్ష్మి.



గంగా మాతా కీ జై

పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానం. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు.




బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుష్కరములు  వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణంగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరం అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరం అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.
పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఈశ్వరుడు తందిలునితో ఏమి వరం కావాలో కోరుకోమని అడిగాడు. తందిలుడు ఈశ్వరునితో తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానంకావాలని కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. అందువలన అతడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు అధికారి అయ్యాడు. ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది. పోషించే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడైయ్యాడు. బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండంలంలోకి ప్రవేశించాడు. బ్రహ్మ కార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్థించాడు .ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదలి వెళ్ళలేనని చెప్పాడు. అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్న సమయంలో రెండు మూహూర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రథమని పురాణాలు చెప్తున్నాయి.

పుష్కర జననం.
పవిత్రమైన నదులలో మానవులు స్నానం చేసి వారి పాపాలను పోగొట్టుకొంటున్నారు. నదులు ఆపాపాలు స్వీకరించి అపవిత్రం అవుతున్నాయి. మానవుల వల్ల అపవిత్రమైన  నదులు పాపాలు భరించలేక బాధ పడుతుంటే పుష్కరుడు అనే మహానుభావుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మ దేవుని అనుగ్రహం పొంది తనను ఒక పవిత్ర క్షేత్రంగా మార్చమని కోరతాడు. ఈ విధంగా పుష్కరుడు పుష్కర తీర్థంగా మారి స్వర్గలోకమున మందాకిని నది యందు అంతర్భూతమై ఉన్నాడు.  భారతదేశంలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నదులకు పుష్కరాల పేరుతో ఉత్సవాలు జరిపే ఆనవాయితీ ఉంది. పుష్కరం అనేది భూమి విూది సప్త ద్వీపాలలోనూ ఒకదాని పేరు. కానీ, సాధారణంగా పుష్కరం/ పుష్కరాలు అంటే నదులకు జరిగే పుష్కరోత్సవాలనే స్ఫురిస్తుంది. మన దేశంలోని పన్నెండు నదులకు పుష్కరాలు జరపడానికి సంబంధించి వాయు పురాణంలో ఒక గాథ ఉంది. బ్రహ్మలోక వాసి పుష్కరుడు గురుగ్రహం ఎప్పుడు ఏ రాశిలో ప్రవేశిస్తుందనే కాలాన్ని బట్టి ఈ పన్నెండు నదులనూ దర్శిస్తుంటాడని ఐతిహ్యం. బ్రహ్మ స్వయంగా పంపించిన వాడు కావడం చేత పుష్కరుడు నదులకు వచ్చినప్పుడు సప్త మహా ఋషులు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి గౌరవిస్తుంటారని, వారు సూక్ష్మ దేహంతో నదులకు వస్తారు కనుక వారు వచ్చిన కాలం పవిత్రమైనదనీ ఒక విశ్వాసం. గురుగ్రహం, అంటే బృహస్పతి మేష రాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరుడు గంగానదికీ, కన్యారాశికి వచ్చినప్పుడు కృష్ణా నదికీ, సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి నదికీ, అలాగే నదులకూ పుష్కరాల ఉత్సవాలు జరుగుతాయి. ఆ నదులు ఏవి అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఉదాహరణకు వేదకాలంలో సరస్వతి నది ఉండేది. ఇప్పుడు అది లేదు. దేశం మొత్తం విూద గంగానది పుష్కరాలే ప్రసిద్ధి. ఎక్కువ మందికి ఆమోద యోగ్యమైన పుష్కర నదుల పేర్లివి - రాశి నామాలతో సహా : సింధు (కుంభ రాశి), నర్మద (వృషభ రాశి), యమున (కర్కాటకం), అదృశ్యవాహినిగా సరస్వతి (మిథున), కావేరి (తులారాశి), ప్రాణహిత (విూన రాశి), భీమ (వృశ్చికం), తుంగభద్ర (మకరం), పుష్కర (ధనుస్సు). బృహస్పతి రాశిలో ప్రవేశించిన మొదటి పన్నెండు రోజులు పుష్కరం అంటారు. సంవత్సర కాలం జరిగే ఈ ఉత్సవాలలో చివరి పన్నెండు రోజులూ అంత్య పుష్కరం. పుష్కరాలు ప్రారంభ మైనప్పటి మొదటి పన్నెండు రోజులే చాలా ముఖ్యం. పితృదేవతలను స్మరించుకోవడానికి, తర్పణాదులకు ఇది చాలా మంచి సందర్భమని పూర్వం నుంచి ఒక విశ్వాసం బలంగా ఉంది. సప్తర్షులేగాక, చాలా మంది దేవతలు కూడా సూక్ష్మరూపులై ఈ నదుల ప్రాంతంలో పుష్కరాలప్పుడు సంచరి స్తుంటారనీ, పుష్కర స్నానాలు చేసే వారికి శుభాలను కలిగిస్తారనీ కూడా నమ్మకం. పుష్కరాలు జరిగే సంవత్సర కాలంలో నదికి సవిూప ప్రాంతాలలోని వారు వివాహాది శుభ కార్యాలు చేయరు. తప్పని సరిగా చేయవలసి వస్తే వేరే ప్రాంతాలకు వెళ్లి చేస్తారు. ఉత్సవాలు జరిగే పన్నెండు రోజులూ అవకాశం ఉన్నవారు నదీ స్నానాలు చేస్తారు, తీరంలో పూజలు, తర్పణాలు, జపాలు, దానాలు చేసే సంప్రదాయం ఉంది.


పుష్కర సమయంలో చేయవలసిన దానాలు.
పురాణాలలో చెప్పబడిన విధంగా పుష్కర సమయంలో చేయవలసిన దానాలు.
మొదటి రోజు;- సువర్ణ దానం, రజితం దానం, ధాన్య దానం, భూదానం చేయాలి.
రెండవరోజు;-వస్త్ర దానం, లవణ దానం, రత్న దానం చేయాలి.
మూడవ రోజు;- గుడ (బెల్లం), అశ్వశాఖ, ఫల దానం చేయాలి.
నాల్గవ రోజు;-ఘృతం (నెయ్యి) దానం, తైలం (నూనె) దానం, క్షీరం (పాలు, మధువు (తేనె) దానం చేయాలి.
ఐదవ రోజు;-ధాన్యదానం, శకట దానం, వృషభదానం, హలం దానం చేయాలి.
ఆరవ రోజు;-ఔషధదానం, కర్పూరదానం, చందనదానం, కస్తూరి దానం చేయాలి.
ఏడవ రోజు;- గృహదానం, పీట దానం, శయ్య దానం చేయాలి.
ఎనిమిదవ రోజు;- చందనం, కందమూలాల దానం, పుష్ప మాల దానం చేయాలి.
తొమ్మిదవ రోజు;-పిండ దానం, దాసి దానం, కన్యాదానం, కంబళి దానం చేయాలి.
పదవ రోజు;-శాకం (కూరగాయలు) దానం, సాలగ్రామ దానం, పుస్తక దానం చేయాలి.
పదకొండవ రోజు;-గజ దానం చేయాలి.
పన్నెండవ రోజు;-తిల (నువ్వులు) దానం చేయాలి.

పిండ ప్రదానం.
సాధారణంగా నదీ స్నానాలలో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు చేసి పితరులను తృప్తి పరచి వారి ఆశీశ్శులు అందుకోవడం శుభప్రథమని విశ్వసిస్తారు.మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం, తొమ్మిదవ రోజున అన్న శ్రాద్ధం, పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని ఋషులు చెప్పారని పురాణాలు చెప్తున్నాయి.శ్రాద్ధకర్మలు ఉపనయనం, వివాహం అయిన పురుషులు తండ్రి మరణాంతరం మాత్రమే చేయాలి.
గంగ దేవికి అనగా గంగా నదికి 12సంత్సరములకు వచ్చే పుష్కరాలు ఈ సంవ్సరం వచ్చినవి.
     కాశీ లో 2023 ఎప్రిల్ 22వ తారీఖు నుండి మే 3వ తారీఖు వరకు గంగా నది పుష్కరాలు నిర్వహింప బడుతున్నవి.
పుష్కరాలలో, పూర్వీకుల ఆరాధన , ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీతం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు  , పూజలు, అభిషేకాలు, గంగా నది పూజా ఇత్యాదులు జరుపుకుంటారు.
పుష్కరకాల స్నానం.
జలానికి రెండు శక్తులున్నాయని వేదం చెప్తుంది. దాహార్తిని తీర్చడం, శుభ్రపరచడం అనే రెండు బాహ్య శక్తులైతే అంతరంగికంగా మేధ్యం, మార్జనం అనేశక్తులున్నాయని వేదం వివరిస్తుంది.మేధ్యం అంటే నదిలో స్నానంచేసి మూడుసార్లు మునక వేస్తే తెలిసి తెలియక చేసే పాపాలు పోతాయని అలాగే మార్జన అంటే నీటిని చల్లుకోవడం అంటే సంప్రోక్షణ చేయడం దీని వలన ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణాల వర్ణన.నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శచే పాపాలు స్నానంద్వారా పటాపంచలు అవుతాయని విశ్వసిస్తారు.తీర్ధ స్నానం ఉత్తమం దానికంటే నదీ స్థానం ఉత్తమం దానికంటే పుష్కర సమయ నదీస్నానం ఉత్తమోత్తమం. ఆసమయంలో దేవతలలంతా పుష్కరునితో నదిలో ప్రవేశీస్తారని హిందువుల విశ్వాసం.త్రికరణాలతో చేసే పాపాలు పోతాయని, పుష్కర స్నానం ఒకసారి చేస్తే పన్నెండు సంవత్సరాల కాలం పన్నెండు పుణ్య నదులలో స్నానంచేసిన పుణ్యం లభిస్తుందని, అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని ఋషి వాక్కు. మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది.నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది.ఇసుకతో కాని, మట్టితో కాని పార్థీవ శివలింగాన్ని చేసి పూజించాలంటారు. నదీ తీరంలోని ఇసుకను నదిలోకి వేయాలంటారు. పురోహితులు భక్తుల తలపై మూడు దోసిళ్ల నీళ్లతో ఆశీస్సులు అందజేస్తారు. 

నదికి వాయినాలు.
సుమంగళిగా జీవితాంతం ఉండాలని కోరుకుంటూ ఆడపడచులు పుష్కరాల సందర్భంగా నదీమతల్లికి వాయినాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే విఘ్నాలు దూరమై అన్నీ శుభాలే కలుగుతాయని విశ్వసిస్తారు. చీర, రవికె, గాజులు, పసుపు, కుంకుమ, పుస్తె, మట్టెలను పూజించి నదిలోకి జారవిడుస్తారు. బ్రాహ్మణ జంటలకు, ముత్తెదువలకు వాయినాలను అందజేసి వారి ఆశీస్సులు స్వీకరిస్తారు.
గంగ జలము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వరూపం కనుక గంగా స్నానం స్పర్శచే పాపాలు పటాపంచలు అవుతాయి.
గంగా నీటికి దాహార్తిని తీర్చడం, శుభ్రపరచడం అనే
బాహ్య శక్తులతో పాటూ, మేధ్యం, మార్జనం అనే ఆంతరంగిక
శక్తులు ఉన్నాయని వేదం వివరిస్తుంది.
మేధ్యం అంటే నదిలో మూడుసార్లు మునక వేస్తే, తెలిసీ తెలియక చేసే పాపాలు పోతాయి.
మార్జన అంటే నీటిని చల్లుకోవడం - సంప్రోక్షణ చేయడం వలన ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణాల వలన తెలుస్తుంది.
తీర్ధ స్నానం , నదీ స్నానం, పుష్కర సమయ నదీస్నానం ఒకదానికి మించి మరొకటి ఉత్తమ మైనవి. 





కాశీలో మీరు బస చేయుటకు కావలసిన వసతి సౌకర్యములు, రుచికరమైన తెలుగువారి టిఫిన్లు మరియు భోజన సౌకర్యములు, కాశీలో చుట్టుప్రక్కల ప్రదేశములు చూచుటకు మరియు మీకు కావలసిన అన్ని ఏర్పాట్ల  కొరకు మరియు కాశీ విశ్వనాథుని అభిషేకములు, పూజ చేయించుకొనుటకై మరియు కాశీవాసము చేయుటకు తగిన వివరములు తెలుసుకొనుటకు మరియు 

ఆంధ్రా టిఫిన్లు, భోజనము మరియు ప్రయాణ సౌకర్యముల కొరకు ఈ క్రింది అడ్రస్సునకు విచ్చేయగలరు లేదా ఈ క్రింది. నంబర్లకు సంప్రదించగలరు.


కాశీ తెలుగు యాత్రికుల సేవా కేంద్రము.
ప్రసాద్ రాజు
9949919752
9455942941
Adress : 
HNO : 17/53.
Beside Thilabhandeshwar Math mandir
Pandey Haveli.
Varanasi.
Uttar Pradesh 
221010.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్యాకేజీ యాత్ర @17000/-

మహాలయ పక్షము 2025

🙏 దక్షిణ భారత తీర్థ యాత్ర 🙏 ప్యాకేజ్ @17300/-