నైమిశారణ్యం. ( నైని )
నైమి శారణ్యం భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రం. ఇది హిందూ మతం మరియు ఆధ్యాత్మికత యొక్క పురాతన కేంద్రాలలో ఒకటిగా నమ్ముతారు. ఈ ప్రదేశం చాలా మంది సాధువులు మరియు ఋషులు సందర్శించినట్లు చెబుతారు మరియు అనేక పురాతన హిందూ గ్రంధాలలో ప్రస్తావించబడింది.
నైమిశారణ్యం (Naimisha Forest) వైష్ణవ దివ్యదేశాలలోఒకటి. ఇక్కడ వనరూపిగా నున్న స్వామికే ఆరాధనలు చేస్తారు.
ఒకప్పుడు మునులు బ్రహ్మ వద్దకు పోయి భూమి మీద తపస్సు చేయుటకు తగిన స్థలమేదని ప్రశ్నింపగా బ్రహ్మ దర్భతో నొక వలయము చేసి భూమిపై విడచి ఇది పడిన చోట తపస్సు చేయదగిన స్థలమని చెప్పెను. అది పడిన చోటే నైమిశారణ్యము. ఇచట గోమతీ నది ప్రవహించుచున్నది. ఇక్కడ మహర్షులు అనేక యజ్ఞయాగాదులు చేశారు. ఆ సమయంలో సూతుడు అష్టాదశ పురాణములు వినిపించెను.
ఈ అరణ్యంలో దాదాపు 84 వేలమంది మునులతో శౌనక మహర్షి సమావేశమై భాగవత పారాయణం చేశాడు. వేదవ్యాసుడు మహాభారతగాథను మొదట తన కుమారుడు శుకమహర్షికి ఇక్కడే చెప్పాడు. వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు ఇక్కడే ఓ మహాయాగం నిర్వహించి మహాభారత పారాయణం చేశాడు. వైశంపాయనుడు చెప్పిన కథను సూతుడు మరోసారి శౌనకాది మునులందరికీ ఇక్కడే చెప్పాడు. సత్యనారాయణ వ్రతవిధానాన్ని కూడా మొదట నైమిశారణ్యంలోనే సూతమహాముని శౌనికాదులకు వివరించాడు. ఇలా ఎంతో ప్రాధాన్యముంది ఈ అరణ్యానికి. ఇక్కడ వ్యాసమహర్షి ఆశ్రమం, దధీచి ఆశ్రమంతోపాటు కొన్ని దేవాలయాలూ ఉన్నాయి.
నైమి శారణ్యం గోమతి నది ఒడ్డున ఉంది. మరియు చుట్టూ దట్టమైన అడవులు ఉన్నాయి. హిందువుల ఇతిహాసమైన మహాభారతాన్ని వ్యాస మహర్షి పఠించిన అడవులే ఈ అడవులు. అందువల్ల, ఈ ప్రదేశం హిందూ పురాణాలు మరియు సంప్రదాయాలకు ముఖ్యమైన కేంద్రంగా పరిగణించబడుతుంది.
నైమి శారణ్యం లో ప్రధాన ఆకర్షణ విష్ణువు ఆలయం, దీనిని నైమిశారణ్య ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయం 108 దివ్యదేశాలలో ఒకటి. ఇది విష్ణువు యొక్క పవిత్ర క్షేత్రం. ఈ ఆలయాన్ని పాండవులు వారి వనవాస సమయంలో నిర్మించారు.
ఆలయంతో పాటు, నైమి శారణ్యం ఆశ్రమాలు మరియు ఘాట్‌లకు కూడా ప్రసిద్ధి చెందింది. ఆశ్రమాలు యాత్రికులకు వసతిని అందిస్తాయి మరియు ఆధ్యాత్మిక అధ్యయనాలు మరియు యోగాలకు ముఖ్యమైన కేంద్రం. ఘాట్‌లు స్నానానికి మరియు ఆచారాలు నిర్వహించడానికి ఉపయోగించబడతాయి మరియు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి.
నైమి శారణ్యం సుందరమైన అందాలకు కూడా ప్రసిద్ధి చెందింది మరియు ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు మరియు యాత్రికులను ఆకర్షిస్తుంది. పచ్చని అడవులు మరియు ప్రశాంతమైన వాతావరణం ఈ ప్రదేశంలో ప్రకృతి ప్రేమికులకు మరియు ఆధ్యాత్మిక అన్వేషకులకు అనువైన ప్రదేశం.
నైమి శారణ్యంహిందూ మతం మరియు ఆధ్యాత్మికతకు ఒక ముఖ్యమైన కేంద్రం, మరియు భారతదేశం మరియు ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు మరియు యాత్రికుల కోసం ఇది ఒక ముఖ్యమైన గమ్యస్థానం. దాని గొప్ప చరిత్ర, పవిత్ర దేవాలయాలు, సుందరమైన అందం మరియు ప్రశాంతమైన వాతావరణంతో, నైమి శారణ్యం నిజంగా ఒక ప్రత్యేకమైన మరియు మనోహరమైన ప్రదేశం.
శ్లో. దివ్య విశ్రాంత తీర్థాడ్యే నైమిశారణ్య పట్టణే |
పుండరీక లతా నాధో దేవరాజాహ్వయో హరి:||
విమానం శ్రీ హరిం ప్రాప్య ప్రాచీ వక్త్ర స్థితి ప్రియ:|
దేవర్షీంద్ర సుధర్మాక్షి ప్రత్యక్ష: కలిజిన్నుత:||
పాశురాలు.
పా. వాణిలాముఱవల్ శిఱునుదల్ పెరున్దోళ్; మాదరార్ వనములైప్పయనే
పేణినేన్; అదవై ప్పిழைయెనక్కరుది ప్పేదై యేన్‌పిఱవినో యఱుప్పాన్
ఏణిలే నిరున్దే నెణ్ణినే నెణ్ణి; యిళై యవర్ కలవియిన్దిఱత్తై
నాణినేన్ వన్దున్ తిరువడి యడైన్దేన్; నైమిశారణియత్తుళెన్దాయ్.
తిరుమంగై ఆళ్వార్లు-పెరియతిరుమొழி 1-6-1
ఇక్కడ మఠములు, రామానుజ కూటములు ఉన్నాయి. వనరూపిగా నున్న స్వామికే ఆరాధన జరుగుతుంది. ఆళ్వార్లు కీర్తించిన సన్నిధిగాని పెరు మాళ్లుగాని ఇక్కడ లేరు. తిరుమంగై ఆళ్వార్లు వనరూపిగా నున్న స్వామినే కీర్తించారని కొందరు పెద్దలు భావిస్తున్నారు. స్వయం వృక్ష క్షేత్రము. వ్యాస, శుక, సూతులకు సన్నిధులు ఉన్నాయి. సూత పౌరాణికుల మఠమున అనేక తాళపత్ర గ్రంథములు ఉన్నాయి.
బలరాముని ప్రాయశ్చిత్తం.
బలరాముని గురించిన పురాణగాధలో బలరాముడు నైమిశారణ్యంలో ప్రాయశ్చితకర్మలు నిర్వహిన్నట్లు తెలుస్తుంది. కురుక్షేత్ర సంగ్రామానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బలరాముడు తాను తటస్థంగా వుండిపోవాలని నిశ్చయించుకుని, తీర్థయాత్రలకు బయలుదేరి, దానిలో భాగంగా నైవిశారణ్యం చేరుకున్నాడు. ఆ సమయంలో మునులందరూ ఆధ్యాత్మిక విషయాలపై సుదీర్ఘమైన సత్సంగంలో ఉన్నారు. బలరాముని చూసి అందరూ లేచి నమస్కరించారు. సభకు ఆచార్యపీఠాన్నలంకరించిన వారు ఇలా లేవకూడదు. కనుక ఆ స్థానంలో వున్న రోమహర్షణుడు (సూతుడు) లేచి నమస్కరించలేదు. ఇది అవిధేయతగా భావించి దీనిని సహించలేని బలరాముడు సూతుని శిరస్సు ఖండించాడు. మునిగణాలలో హాహ కారాలు చెలరేగినాయి. ఈ ఉద్విగ్నిత కొంత ఉపశమించిన తరువాత ఈ బ్రహ్మహత్యా పాతకానికి బలరాముని ప్రాయశ్చిత్తం చేసుకోమన్నారు. అప్పటికే పశ్చాత్తాపపడుతున్న బలరాముడు ప్రాయశ్చిత్తమేదో వారినే నిశ్చయింపమన్నాడు. వారు అక్కడ బల్వుడనే రాక్షసుడు మహా భయంకరుడు. అమావాస్య, పౌర్ణమి రోజులలో మా సమావేశాలను భగం చేస్తూ, రక్త మలమూత్రాలు మాపై కురిపిస్తున్నాడు. ముందు వాణ్ణి సంహరించి మాకుపకారం చేయి. తరువాత 12 మాసములు బ్రహ్మవర్తంలోని సకల తీర్థాలు సేవిస్తే బ్రహ్మ హత్యాపాతకం నుంచి విముక్తుడవు అవుతావని తెలిపారు. ఇంతలో పౌర్ణమిరానే వచ్చింది. పెద్ద తుఫాను చెలరేగి, చీము, రక్తమూ వర్షిస్తూ నల్లని పర్వతాకారంలో అతి భయంకరంగా బల్వలుడు అనే రాక్షసుడు విజృంభించాడు. బలరాముడు తన ఆయుధాలను స్మరించగనే అతని గద, నాగలి చేతికి వచ్చాయి. బలరాముడు గదతో వాడి తలవ్రక్కలు చేశాడు. వాడు భయంకరంగా అరుస్తూ నేలకొరిగారు. మునులందరూ మంత్రజలం చల్లి బలరాముని ఆశీర్వదించారు. అప్పుడు బలరాముడు వేద ప్రమాణపరంగా మానవుడు తన ప్రతిరూపంగా పుత్రుడై జన్మిస్తాడు గనుక యికనుండి రోమహర్షుని తనయుడు మీకు పురాణ ప్రవచనం చేస్తాడు. అతనికి దీర్ఘాయువు, బలము ఇంద్రియపటుత్వము ప్రసాదిస్తున్నానని అన్నాడట. మునులందరూ అంగీకరించి అతణ్ణి వైజయంతి మాలతో సత్కరించి పంపారు.
బ్రాహ్మణులకు దానం చేసిన గ్రామమే నేటి 'సీతాపురం' .శుక్రాచార్యుల వారి ద్వారా ఈ క్షేత్ర పవిత్రత గురించి తెలుసుకున్న ప్రహ్లాదుడు, ఇక్కడి తీర్థాలను దర్శించినట్టు చెబుతారు. ఇక శౌనకాది మహర్షులకు సూతమహాముని మహాభారత కథను తొలిసారిగా వినిపించినది ఇక్కడే.
ప్రదక్షిణ.
నైమిశారణ్యంలో 84 క్రోసుల ప్రదక్షిణ యాత్ర అనేదొకటి అని విశ్వసిస్తుంటారు. ఫాల్గుణమాసంలో ఈ ప్రదక్షిణలో భాగంగా భక్తులు నైమిశారణ్యంలో మొదలుపెట్టి, 11 పవిత్ర క్షేత్రాలలో యాత్ర చేసుకుంటూ, మాఘమాసంలో ప్రయాగలోని త్రివేణి సంగమం వద్ద యాత్ర ముగిస్తారు.
right పురాణపురుషాలయంలో శుకుడు
ఇక్కడ ఆనందమయి మాత ఫౌండేషన్ వారు నిర్మించిన పురాణ పురుషుని మందిరం చాలా అందమైన నిర్మాణం. పురాణ పురుషుని విగ్రహం పంచలోహంతో మలచారు. చిలుక తలతో, అభయముద్రలో, ప్రశాంత గంభీర వదనంతో వుంటుంది. ఇక్కడ పురానముల మీద పరిశోధన జరుగుతోంది. 18 పురాణాల తాళ పత్ర గ్రంథాలు పట్టుబట్టలో చుట్టి ఒక వేదిక మీద ఉంచారు. దీని చుట్టూ రేలింగ్ అమర్చి ఒక పక్క వేదవ్యాసుని విగ్రహం ప్రతిష్ఠించారు. మరో పక్క నూతుని విగ్రహముంది. దీనికి ప్రక్కనే బహు విశాలమైన గోష్ఠిమందిరం పెద్ద పెద్ద పట్టుపురుపులతో, గద్దెలతో పవిత్ర వాతావరణం ఆవరించింది ఉంది.
అహోబిల మందిరం
అహోబిలమందిరంలో నరసిహాలయద్వారం
మన అహోబిలమఠం వారిక్కడ నిర్మించిన ఆలయంలో నారసింహుని పంచలోహ విగ్రహం నిత్య పూజలతో అలరారుతోంది.
దధీచి కుండము
ఇది ప్రసిద్ధికెక్కిన స్థలం. దీనికో పౌరాణిక గాథ ఉంది. దేవదానవ యుద్ధాలు తరతరాలుగా జరిగాయని పురాణకథనాలు వివరిస్తున్నాయి. అలాంటి ఒక యుద్ధంలో తారకాసురుడు విజృంభించి, దేవతలనందరినీ చంపుతున్న తరుణంలో ఇంద్రుడు విష్ణువును సమీపించి దేవతలకు రక్షంచమని వేడుకున్నాడు. విష్ణుమూర్తి సలహా మేరకు దధీచి మహర్షి ఎముకతో తయారుచేసిన ఆయుధం రాక్షస సంహారం చేయగలదని తెలిపాడు, ఇంద్రుడు ఆ మహర్షిని దర్శించి జరిగిన విషయం వివరించి ఆయన వెన్నెముకను ఇవ్వమని కోరాడు . ఆ మహాత్ముడు ఈ కోరిక లోక కళ్యాణార్థమని గ్రహించి, యోగమార్గాన తన శరీరాన్ని త్యజించాడు. ఆయన సుదీర్ఘ తపస్సుతో, అనూహ్యశక్తి సంపన్నమైన ఆయన వెన్ను ఎముకలతో ఇంద్రుడు వజ్రాయుధాన్ని తయారుచేసుకుని విజయం సాధించాడు.యిప్పటికీ ఇదే ఇంద్రుని ఆయుధం. ఈ సంఘటన జరిగిన ప్రదేశంగా ఈ దధీచికుండానికి ప్రత్యేకమైన ప్రాశస్త్యం ఉంది. లోకకళ్యాణార్థం, తన శరీరాన్ని తృణప్రాయంగా త్యజించిన త్యాగనిరతికి ప్రత్యక్ష నిదర్శనం ఈ దధీచి కుండం.
గోమతినది ఒడ్డున ఉన్న నైమిశారణ్యం వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం. వేదవ్యాసుడు నైమిశారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్టు తెలుస్తోంది. మహా భారతం, రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిశారణ్య ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు వేదాలను, అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావన ప్రదేశం నైమిశారణ్యం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి