కాశీ క్షేత్ర మాహాత్మ్యం.

కాశీ కాశీ కాశీ

కాశీ మహత్యం ఇంత అని ఇది అని చెప్పడానికి మానవ మాతృలకు వర్ణింప శక్యము కానిది.
కాశీలో అనేక సంత్సరాలుగా ఉన్నవారు ఇక్కడే పుట్టి పెరిగిన వారు ఒక తరం రెండవ తరం మూడవ తరం నాల్గవ తరం ఇలా జీవించి ఉన్న సనాతన వాదులు అదే విధంగా సనాతన ధర్మం పాటిస్తున్న ధార్మికులు పూజారులు సంతులు సన్యాసులు ఇత్యాదులు అందరూ చెప్పే మాట మాకు ఇంతవరకు మాత్రమే తెలుసు. కాశీ మొత్తం మాకు సైతం వర్ణింప శక్యము కానిది. మాకు పెద్దల ద్వారా సంక్రమించిన అధికారాలను ధర్మములను మేము ఆచరిస్తూ వస్తున్నాము. కాశీని గూర్చి దేవతలు సైతం వర్ణింప శక్యము కానిది మానవ మాతృలము మనమెంత - అని.

కాశీ అవినాశి. స్వయం ప్రకాశి. పార్వతీ పరమేశ్వరులకు ఆ ఆది దంపతులిద్దరికీ బహు ప్రియ మైనదీ - దేవతలకు ఇష్ట మైనది -  ఈ మోక్ష నగరం.

కాశీ క్షేత్ర మహాత్మ్యం ఎక్కువగా అగస్త్య స్కంద సంవాదము అయిన స్కాంద పురాణంలో పురాణ అంతర్గతంగా కాశీ ఖండం లో వర్ణింప బడినది.

కాశీలో ఉత్తరవాహిని అయిన గంగామహిమ, కాశీ చరిత్ర, కాశీమహత్యమును గురించి వినాలన్నా, తెలుసుకోవాలన్నా విశ్వేశ్వరానుగ్రహము ఉండి తీరవలసిందే. సూర్యుడు ఒక ప్రదేశమందు ఉండి సర్వవ్యాపిగా దర్శనమిచ్చునట్లే కాశీయందు విశ్వేశ్వరుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు కనుకనే ముక్కోటి దేవతలు విశ్వనాథుని సేవించుటకై కాశీకి చేరుతున్నారు.



పూర్వజన్మ పుణ్యఫలము తోడయితేనే కాశీలో కాలు పెట్టగలిగే అదృష్టము కలుగుతుంది. విశ్వేశ్వరుని దయకు పాత్రులయినవారికి మాత్రమే కర్మబంధనములు నశించి కాశీకి వెళ్ళవలెననే ఆలోచన - కోరిక కలుగుతుంది. ప్రతి జీవి నవమాసములు మాతృగర్భంలో ఉండి తల్లికి ఋణపడతాడు. 
నవమాసములు  కాశీలో వాసము ఉండుట వలన మరల మాతృగర్భవాసముండదు. 
మహాదేవుని త్రిశూలాగ్రము మీద ఉండు కాశీపట్టణము మోక్షప్రదాయిని. మరుజన్మ లేకుండా ముక్తిని కలిగించే కాశీ మహత్యం, పార్వతి కోరగా పరమశివుడు స్వయoగా పార్వతికి తెలిపిన విషయములు పార్వతీదేవి ఒడిలో కూర్చుని విన్న స్కందుడు అగస్త్యునికి వివరించాడు. 



విశ్వేశం మాధవం డుంఢిం దండపాణిం చ భైరవం | వందేకాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం ॥ విశ్వేశ్వరుడికి, బిందు మాధవుడికి, డుంఢిగణపతికి, దండపాణికి, కాలభైరవుడుకి, కాశీదేవికి, గుహ (జైగీషవ్యగుహ)కి, గంగాదేవికి, భవానీ (దుర్గాభవానీ) దేవికి, మణికర్ణికాదేవికి నమస్కారం. కాశీక్షేత్రానికి వెళ్ళినవారు ప్రతిరోజూ ధ్యానించాల్సిన శ్లోకం ఇది. ఈ శ్లోకంలోనే కాశీలో తప్పనిసరిగా దర్శించాల్సిన ప్రసిద్ధ స్థలాలు కూడా చెప్పబడ్డాయి.

  శివ భక్తి 

పూర్వం ఒకానొక నగరంలో సంఘంచేత బహిష్కృతుడైన ఒక దొంగ ఉండేవాడు. వాడు ఎంతో దుర్మార్గుడు. శిశుహత్యలు చేసాడు. మద్యపానం రోజూ చేస్తాడు. జూదరి, లంపటుడు. వాడికి లేని దుర్గుణం లేదు. ఎప్పుడూ తనలాగే వ్యసనపరులతో, దుర్మార్గులతో కలిసి సంచరిస్తుంటాడు. అయితే అతడొక శివభక్తుడు.

ఒకనాడా దుర్మార్గుడు జూదం ఆడటానికి జూదశాలకి వెళ్ళాడు. అక్కడ ఆట ఆడుతూ ఆడుతూ చివరికి ఓడిపోయాడు. చేతిలో ఉన్న డబ్బంతా అయిపోయింది. డబ్బులేదని చెప్పాడు. ఆ మాట విని కోపంతో గెలిచిన జూదరులంతా ఇతన్ని దారుణంగా కొట్టారు. అయినా అతడు ఉలకలేదు పలకలేదు. అప్పుడొక జూదరి ఇతన్ని పైకి లేపి మర్యాదగా జూదంలో ఓడిన డబ్బు ఇస్తావా! చస్తావా! అని గద్దించాడు. ఈ రోజు రాత్రికి ధనాన్ని తెచ్చిస్తానని చెప్పాడు ఆ తస్కరుడు.


జూదంలో ఓడిన దొంగకి ధనం ఎలా తేవాలో తోచలేదు. ఆరోజు రాత్రి అక్కడున్న ఒక శివాలయానికి వెళ్ళాడు. శివలింగంపైన వెండిగంట కనిపించింది. దాన్ని దొంగలించి ఆ ధనంతో తన అప్పు తీరుద్దామనుకున్నాడు. వెంటనే యుక్తాయుక్తాలు మరిచి శివలింగం మీదకి ఎక్కి గంటను అందుకోబోయాడు. అదే సమయంలో కైలాసంలో వున్న తన కింకరులతో శివుడిలా అన్నాడు. "కింకరులారా! ఇప్పుడు భూలోకంలో నా తలమీదకెక్కి గంటని దొంగలించే దొంగ నా భక్తుడు. నాకెంతో ప్రీతి పాత్రుడు" అని చెప్పి వీరభద్రుణ్ణి పిలిచి "వీరభద్రా! నీవు వెంటనే భూలోకంలో దొంగ వున్న శివాలయానికి వెళ్ళి అతణ్ణి తీసుకురా! అని ఆజ్ఞాపించాడు. శివాజ్ఞ ననుసరించి వీరభద్రుడు ప్రమథ గణాల్ని వెంటబెట్టుకుని దొంగ వున్న ఆలయం దగ్గరకి వెళ్ళాడు.

ప్రమథగణాల కోలాహలం వినగానే దొంగకి భయంవేసింది. వెంటనే శివలింగo దిగి పారిపోబోయాడు. అంతలో వీరభద్రుడు అక్కడికి వచ్చి ఓరీ మూర్ఖుడా! ఎందుకలా పరుగెడుతున్నావు. పరమేశ్వరుడు నిన్ననుగ్రహించాడు. ఎక్కడికి పోతావు. ఇటురా! ఇదిగో ఈ దివ్యవిమానాన్ని ఎక్కు అని సాదరంగా ఆహ్వానించాడు.

వీరభద్రుడి మాట వినగానే ఆ దొంగకి ధైర్యం వచ్చింది. వెంటనే వెనక్కి వచ్చాడు. వీరభద్రుడు అతన్ని ఎక్కించుకుని కైలాసానికి తీసుకువెళ్ళాడు. అలా ఆ దొంగ శివానుగ్రహంతో శివలోకంలో పరిచారకుడిగా మారాడు. కనుక జీవులందరికీ బాగా ఉండాల్సింది శివభక్తి.

విశ్వేశం మాధవం డుంఢిం దండపాణిం చ భైరవం | వందేకాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం ॥ విశ్వేశ్వరుడికి, బిందు మాధవుడికి, డుంఢిగణపతికి, దండపాణికి, కాలభైరవుడుకి, కాశీదేవికి, గుహ (జైగీషవ్యగుహ)కి, గంగాదేవికి, భవానీ (దుర్గాభవానీ) దేవికి, మణికర్ణికాదేవికి నమస్కారం. కాశీక్షేత్రానికి వెళ్ళినవారు ప్రతిరోజూ ధ్యానించాల్సిన శ్లోకం ఇది. ఈ శ్లోకంలోనే కాశీలో తప్పనిసరిగా దర్శించాల్సిన ప్రసిద్ధ స్థలాలు కూడా చెప్పబడ్డాయి.

ఈ కలియుగంలో జీవులందరికీ, కాశీక్షేత్రం కన్నా పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగించే మరో క్షేత్రం లేదు. వేలజన్మల్లో చేసిన పాపం కాశీలో ప్రవేశించగానే నశిస్తుంది. యోగం ద్వారా వేయిజన్మల్లో కలిగే ముక్తి కాశీక్షేత్రంలో మరణిస్తే అనాయాసంగా లభిస్తుంది. కాశీలో ఉండే పశు పక్ష్యాదులు కూడా మరణానంతరం ముక్తిని పొందుతాయి. మూర్ఖులైనవారు మోహాంధకారంలో మునిగి, కాశీక్షేత్రాన్ని సేవించకుండా మలమూత్ర భూయిష్టమైన మాతృగర్భవాసాన్ని పొందుతారు. కాశీక్షేత్రంలో శివలింగాన్ని ప్రతిష్ఠించినవారికి, శతకోటి కల్పాల వరకూ పునర్జన్మ ఉండదు.

బ్రహ్మహత్యచేసిన వాళ్ళు కూడా మనోనిగ్రహంతో కాశీలో నివసిస్తూ, అక్కడే శరీరాన్ని వదిలేస్తే వారికి కూడా ముక్తి లభిస్తుంది. కాశీ క్షేత్రంలో మరణించిన వాడికి, పరమేశ్వరుడు స్వయంగా తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. దానివల్ల ఆ జీవుడు బ్రాహ్మీమయ మూర్తిగా మారిపోతాడు.

 పుణ్యం, దానం, జపం, తపం వల్ల కాశీవాసం అందరికీ లభించదు. కేవలం పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటేనే ఆ క్షేత్రవాసం కలుగుతుంది.



కాశీక్షేత్రం బ్రహ్మ సృష్టి కన్నా విభిన్నమైనది. క్షేత్ర మహిమని పరమేశ్వరుడు సైతం సంపూర్ణంగా వర్ణించలేడు. సంపదలు, శరీరం ఎప్పటికైనా నశించి పోయేవే. ఆయువు చంచలమైనది. అది ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలీదు. ఈ విషయాన్ని గుర్తించి అందరూ కాశీ క్షేత్రాన్ని ఆశ్రయించాలి. మరణం వచ్చే వరకూ కాశీని విడచి రాకూడదు. పాశుపతయోగం కన్నా, ప్రయాగ తీర్థం కన్నా జీవులకి అనాయసంగా ముక్తినిచ్చే క్షేత్రం కాశీ. 

కాశీ క్షేత్రంలో ప్రాణాలు విడిచినవాడికి మాత్రమే విదేహ విముక్తి కలుగుతుంది. కానీ ఇతర ప్రదేశాల్లో మరణిస్తే రాదు.


ఈ కారణం వల్లనే కాశీక్షేత్రం పవిత్రమైనది. విశ్వనాథుడికి ప్రియమైనది. ఇంద్రియనిగ్రహంతో మూడురోజులు కాశీ క్షేత్రంలో నివసించిన వారి పాద రేణువులు ఎక్కడ పడితే ఆ ప్రాంతమంతా పవిత్రమై పోతుంది.


ఆనంద వనం - -అవిముక్తం కాశీక్షేత్రానికి అవిముక్తం ఆనందవనం అనే రెండు పేర్లున్నాయి.

ఈ నగరం అయిదుక్రోసుల పరిమాణంలో ఉంటుంది. పవిత్రమైన ఈ కాశీక్షేత్రాన్ని పార్వతీ పరమేశ్వరులు ప్రళయకాలంలో కూడా విడిచిపెట్టరు. అందుకే దీనికి అవిముక్త క్షేత్రం అనే పేరు వచ్చినది.

భూమి, నీరు లాంటివి ఏమీ లేవి సమయంలో విహారం కోసం పరమేశ్వరుడు ఈ అవిముక్త క్షేత్రాన్ని నిర్మించాడు. ఈ దివ్యక్షేత్రం మోక్ష స్వరూపమైన ఆనందానికి హేతువు అవటం వల్ల మహాదేవుడు దీనికి ఆనందవనం అనే పేరు పెట్టాడు. తరువాత కాలంలో ఈ ఆనందవనమే అవిముక్తంగా ప్రసిద్ధి చెందింది.

                    కాశీ - గంగ

 నాస్తి గంగా సమం తీర్థం కలికల్మషనాశనం ll 
 నాస్తిముక్తి ప్రదం క్షేత్రం అవిముక్తం సమంహరే ॥

కలిదోషాల్ని పరిహరించటంలో గంగానదితో సమానమైన తీర్థం మరొకటి లేదు. అలాగే ముక్తిని ప్రదానం చేసే దివ్యక్షేత్రాలలో అవిముక్త క్షేత్రాన్ని మించిన క్షేత్రం లేదు.

గంగానదిలో తిథివార నక్షత్ర నియమాలు లేకుండానే స్నానం చేయవచ్చు.

కాశిలో ఉన్న గంగని సేవించినవాడు, గంగా దేవికి మందిరాన్ని నిర్మించినవాడు సమస్త సుఖభోగాల్ని పొందుతాడు.

గంగాదేవిని స్మరించినా, ఆమె మహిమని విన్నా, వినిపించినా వారికి గంగాస్నానఫలం దక్కుతుంది.


 పితృదేవతల్ని ఉద్దేశించి వారి పేర్లు స్మరిస్తూ గంగలోని నీళ్ళతో ఏ శివలింగానికి అభిషేకం చేసినా, వారి పితరులకి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి.

గంగాజలంతో సూర్యుడికి అర్ధ్యాలు సమర్పిస్తే ఆరోగ్యం పెంపొందుతుంది. 
గంగాస్నానం చేసే వారిజోలికి యమదూతలు ఎప్పుడూ రారు.

 కాశీలోని గంగా తీరంలో గోదానం, భూదానం, సువర్ణదానం, అన్నదానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు.

 మకరసంక్రమణం, ఉత్తర, దక్షిణాయనాలు, సూర్య చంద్రగ్రహణాలు తదితర పర్వదినాలలో కాశీగంగలో చేసే స్నానం అనంతమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది.



  స్కాంద పురాణంలోని మంత్ర రాజము.

జ్యేష్ఠమాసే సితే పక్షే దశమీ హస్త సంయుతా ll 
తస్యాం దశమ్యాంమే తచ్చ స్తోత్రం గంగాజలే స్థితః ॥ 

 జ్యేష్ఠమాసం శుద్ధ దశమీ హస్తానక్షత్రం ఉన్న రోజున గంగాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ రోజు దశహర గంగాస్తోత్రాన్ని శ్రద్ధగా పఠించి గంగాస్నానం చేసిన భక్తులకు పాపాలన్నీ హరించి పోతాయి.

కాశీ ఖండం –27
గంగా మహాత్మ్యం

పార్వతీ దేవి శివుడిని భాగీరధ వృత్తాంతాన్ని,గంగకు భాగీరధి అనే పేరు ఎలా వచ్చింది ఆ విషయాన్ని ఆమె కు చెప్పిన వైనాన్ని అగస్త్యునికి స్కందుడు చెబుతున్నాడు . గంగ లో పితృ దేవతలు ఎల్లప్పుడు ఉంటారు కనుక వారికి ఆవాహన ,విసర్జన అక్కర లేదు .పితృ ,మాత్రు వంశాలలో మరణించిన వారు ,అగ్ని ప్రమాదం లో చని పోయిన వారు ,విద్యుత్తు ,పులి వల్లా ,పక్షి మృగ క్రిమి కీటకాలను హింసించి చంపినవారు ,ఉరి వేసుకొని చని పోయిన వారు ,విషం చేత ,చచ్చిన వారు ,కుంభీపాక ,రౌరవాది నరకాలలో ఉన్న వారు ,యమ లోకం లో ఉన్న వారు పుత్రులు లేకుండా మరణించే వారు,క్రుతఘ్నులు మిత్రద్రోహులు ,డబ్బు దోచే వారు ,అనాధలు దీనులు మొదలైన వారికి గంగా జలం తొ తర్పణం విడిస్తే వారంతా స్వర్గాన్ని పొంది ,భోగాలను భ విస్తారు .

మూడు లోకాల్లో ఉన్న తీర్ధాలన్నీ కాశి లో ని గంగా జలం లో ఉన్నాయి .ఇక్కడి ఉత్తర వాహిని అయిన గంగా నది ని ‘’స్వర్గ సముద్రం ‘’అంటారు .బ్రహ్మ హత్యా పాతక దోషాన్ని కూడా పరి హరించే సమర్ధత గంగకు ఉన్నది .ముక్తి క్షేత్రం . .విశ్వ నాధుని అనుగ్రహం తో అమృతత్వాన్ని పొందుతారు .మహా పాపి కూడా అంత్య కాలం లో గంగా స్నానం చేస్తే పాపం నుండి విముక్తు డవుతాడు .

పూర్వం కళింగ దేశం లో ఒక బ్రాహ్మనుడుందే వాడు ఉప్పు అమ్ముకొని జీవించే వాడు .స్నానం ,సంధ్యా అంటే ఏమిటో అతడికి తెలియదు .అతని పేరు ‘’వాహికుడు ‘’యజ్ఞోప వీతం మాత్రం ఉండేది .ఒక శూద్ర విధవా స్త్రీ ని పెళ్లి చేసుకొన్నాడు .ఆ దేశం లో విప రీతమైన కరువు వచ్చింది .అంతా దేశం వదిలి పోతున్నారు .వీరిద్దరూ కూడా వెళ్లారు దారిలో ఒక పెద్ద పులి అతడిని చంపి తినేసింది . అతడి ఎడమకాలి ని మాత్రం ఒక గ్రద్ద తన్నుకొని పోయింది .ఇంకో గ్రద్ద ఈ మాంసం కోసం దానితో యుద్ధం చేసింది .ఆ గ్రద్ద నోటి నుండి జారిన వాహికుని ఎడమకాలు అదృష్ట వశాత్తు గంగా నదిలో పడింది .యమదూతలు అతన్ని చేరి చర్నాకోలు తో కొట్టి బాధించటం ప్రారంభించారు .అతడి నోరు ,ముక్కుల నుండి రక్తం కారుతోంది .అలాగే వాడిని యమ ధర్మ రాజు వద్దకు తీసుకొని పోయి నిల బెట్టారు .చిత్ర గుప్తుని పిలిచి అతడి పుణ్య ,పాప విశేషాలు చెప్పా మన్నాడు యమధర్మ రాజు .

చిత్ర గుప్తుడు చిట్టా విప్పి చెప్పాడు .అతడు జన్మించిన దగ్గర్నుంచి జాత కర్మ జరగ లేదని ,ఆయుర్బలం వల్ల గర్భ దోశాలేమీ అంతలేదని ,పదకొండో రోజు న నామ కరణం జరగ లేదని ,నాల్గవ నెలలో బయటికి తీసుకొని వెళ్ళ లేదని ,శుభ తిధులలో తండ్రిఅతడిని తన వెంట తీసుకొని వెళ్ళే వాడని ,అన్నప్రాసనా చేయ బడ లేదని తండ్రి మిఠాయి కొని సూర్యుడికి చూపించి కొడుక్కి పెట్టే వాడని ,చూడా కర్మ ,కర్ణ వేద విధి విధానం లో జరుగ లేదని,స్వర్ణ కారుడేవరో చెవులు కుట్టాడని ,ఎనిమిదో ఏట మౌన్జీ ధారణా జరిగిందని ,దాని విసర్జన శాస్త్ర ప్రకారం చేయ లేదని ,శూద్ర స్త్రీని పెళ్లి చేసుకొన్నాడని ,చిన్నప్పటి నుండి దొంగ గా బతికాడని ,జూదం అడే వాడని ఉప్పు అమ్ముకొనే వాడని ఒక ఆవుదూడ వచ్చి ఉప్పు నాకు తుంటే దాన్ని కొడితే అది మరణించిందని ,తల్లిని చాలా సార్లు కాలితో తన్నాడని ,తండ్రి మాట వినే వాడుకాడని ,చాలా సార్లు ఇతరులతో పోట్లాడాడని, విషం తాగుతానని బెది రించే వాడని ,ఒకప్పుడు అగ్ని చేత దగ్ధ మయాడని ,జంతువులనేక సార్లు కొమ్ములతో ఇతన్ని కుమ్మేశాయని ,కర్రలు పెట్టి అఘాయిత్యం గా తల పగలకొట్టుకొనే వాడని ,చర్మం ,మాంసం ,గోళ్ళు అమ్మే వాడని పగలే స్త్రీ లతో వ్యభిచరించే వాడని కాసే ,పూసే చెట్లను నిష్కారణం గా నరికేసే వాడని ఇంతెందుకు వీడు మూర్తీభవించిన పాపమే అని ఏకరువు పెట్టాడు చిత్ర గుప్తుడు .

అతడిని చిత్ర హింసల పాలు చేయమని యముడు ఆజ్ఞ జారీ చేశాడు. 
అంతలో అతని ఎడమ కాలు గంగా నదిలో పడటం వల్ల స్వర్గం నుండి విమానం వచ్చి అప్సరసలు సేవిస్తుండ గా వాహికుడిని స్వర్గానికి తీసుకొని పోయారు .కనుక గంగా నది పుణ్య ప్రదమైంది అని స్కందుడు చెప్పాడు .సదా శివ సంబంధ మైన ఒకానొక శివ సంబంధ శక్తి ఎప్పుడూ గంగ లో ప్రవహిస్తూ ఉంటుంది .దేవదేవుడే జగద్రక్షణ కోసం గంగ రూపాన్ని పొందాడు .శంభుని చే వేదాక్షరాలు వడ కట్ట బడి ఆ గంగా ధరుని చే గంగా జలం గా చేయ బడింది .యోగా ,సాంఖ్య ఉపనిషత్ సారం గంగా జలం ..గరుత్మంతుని చూసినంతనే పాములు పారి పోయి నట్లు భాగీరధిని చూస్తేనే పాపాలన్నీ పారి పోతాయి .గంగ మట్టిని శిరస్సు న ధరిస్తే సూర్య సమాన తేజం కలుగుతుంది .గంగా స్తుతి ,దర్శనం, స్పర్శనం, పానం, స్నానం సర్వ కామాలను తీరుస్తాయి .నదులలో ఉత్తమ మైనది .చంద్రుని కూడా శోభా వంతుని చేసే లక్షణం ఉంది .గంగయే సర్వ తీర్ధం .అదే తపోవనం .;గంగను మించిన దేదీ లేదు ఇది సత్యం సత్యం ,పునస్సత్యం


కాశి కాశి అని ఎప్పుడూ మనసులో జపిస్తూ ఉంటే లోకంలో ఎక్కడవున్నా కాశీవాసం చేసినట్టే అవుతుంది. తద్వారా ముక్తి లభిస్తుంది. సర్వకాల సర్వాయవస్థల్లో ''కాశి" అనే రెండక్షరాల మంత్రాన్ని జపించేవారికి భయమన్నదే తెలియదు. 'కాశి' అనే రెండు బీజాక్షరాలని హృదయంలో స్థిరంగా నిలుపుకున్నవారికి కర్మబీజాలు నశించిపోతాయి.

ముక్తిని కోరుకునే వారు కాశీ క్షేత్రంలో నివసిస్తూ ఉత్తర వాహిని గంగలో నిత్యం స్నానం చేస్తూ విశ్వనాథుణ్ణి సేవించాలి. ప్రేమ క్షమా భక్తి మొదలగు గుణాలతో ప్రశాంత చిత్తులై సంచరించాలి. ఎప్పుడూ అందరికీ హితమైన పనులే చేయాలి. ఎవరితో ఉద్వేగంగా మాట్లాడకూడదు. మనసులో కూడా పాపచింతన చేయరాదు.

ఇతర ప్రదేశాల్లో చేసిన పాపాలు కాశీ క్షేత్రాన్ని చేరగానే నశిస్తాయి. అయితే వారణాశిలో చేసిన పాపాలు కోటి కల్పాలు గడిచినా నశించవు. కాశీలో తెలిసి పాపంచేసిన వారికి, ముప్ఫైవేల సంవత్సరాలు రుద్రపిశాచ జన్మ కలుగుతుంది. అయితే వారు కాశీవాసం చేసిన కారణంగా రుద్ర పిశాచజన్మ తరువాత తిరిగి కాశీలోనే జ్ఞానులుగా పుడతారు. ఈ విషయాన్ని గ్రహించి మోక్షపురి అయిన కాశీ క్షేత్రంలో ఎలాంటి పాపాలూ చేయకుండా ప్రవర్తించాలి.

అగస్త్యుడు కుమారస్వామితో ‘’స్వామీ !
తల్లి పార్వతీ దేవికి తండ్రి పరమేశ్వరుడు వారణాసి మహిమను వర్ణించి చెప్పినప్పుడు నీవు ఆమె ఒడిలో కూర్చుని సమస్తము విన్నావు .అదంతా నాకు సవిస్తారంగా చెప్పమని అర్ధిస్తున్నాను ‘’అని అడిగాడు .దానికి స్కందుడు ‘’అదంతా చెబుతాను విను కాశీ క్షేత్రం లో ఉన్నా, గంగ నీరు త్రాగినా ,విశ్వేశ దర్శనం చేసినా ,అక్కడి గాలి పీల్చినా పుణ్యం వస్తుంది . కాశీ లో తపస్సు చేసిన వారికి వేరొక చోట వెయ్యి తపస్సులు చేసినప్పుడు వచ్చే ఫలితం లభిస్తుంది .ఇక్కడ యావజ్జీవితం నివశించే వాడు మృత్యు ,భయ రహితుడవుతాడు .. పునర్జన్మ లేకుండా ఉండాలంటే ,కాశీ - వాసం తప్పనిసరి .అవిముక్త క్షేత్రమైన కాశీని వదల రాదు .ప్రాణము మర్మ స్థానాన్ని చ్చేదించుకొని వెళ్ళేవరకు కాశీలో స్మృతి ఉంటుంది . ప్రాణి ఉత్క్రమణం చెందేటప్పుడు సాక్షాత్తు విశ్వేశ్వరుడే వచ్చి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు దానితో ప్రాణి 
"బ్రహ్మ స్వరూపుడవుతాడు .’’అని ఆరుముఖాల కుమారస్వామి చెప్పాడని లోపాముద్రకు అగస్త్యుడు చెప్పాడు .

పార్వతీ పరమేశ్వరులకు ఇంకా ఏమి సృష్టించాలి అన్న ఆలోచన వచ్చింది .పార్వతి దేవి వైపు సాభిప్రాయంగా చూశాడు .వెంటనే ఆమె శరీరం నుండి సత్వగుణోపేతుడైన అచ్యుతుడుద్భవించాడు .అప్పుడు శివుడు అతనితో‘’నువ్వు విష్ణువు అనే పేరుతో పిలువబడుతావు .నా ఉచ్చ్వాస నిస్శ్వాసాల వల్ల వేదాలు ఉద్భవిస్తాయి అని చెప్పి విష్ణువుకు బుద్ధిత్వానికి అధిపతిని చేశాడు .శివుడు ఆనంద కాననానికి పార్వతితో సహా వెళ్లి పోయాడు .

విష్ణువు శివుని గురించి తపస్సు చేయ సంకల్పించాడు .సుదర్శన చక్రం తొ భూమిని త్రవ్వి ఒక పుష్కరిణి ఏర్పాటు చేశాడు .అందులో ఆయన చెమట బిందువులు పడి నీటితో నిండిపోయింది .దాని ఒడ్డున తీవ్ర తపస్సును కదలకుండా చేసి స్తాణువేఅయ్యాడు .
ఈశ్వరుడు సతీసమేతంగా వచ్చి మెచ్చాడు. ఎల్లప్పుడు శివ పార్వతులను దర్శించే భాగ్యం ప్రసాదించమని విష్ణువు వరం అడిగాడు .సరేనన్నాడు .విష్ణువు కఠోర తపస్సుకు ఇంకో వరం ఇచ్చాడు .విష్ణువు తపస్సు చూసి ఆనందంతో శిరస్సు ఊపుతుంటే ఆయన మణి కర్ణిక అనే కర్ణ భూషణం ఒకటి జారి పుష్కరిణి లో పడింది .ఇక నుంచిఈ ప్రదేశం అంటే విష్ణువు తవ్విన పుష్కరిణి మణి కర్ణికఅని పిలువబడుతుందని చెప్పాడు .

అప్పుడు విష్ణువు ‘’శివా !
నీవల్ల ఈ పుష్కరిణి మణి కర్ణిక అవటం ఆనందం గా ఉంది.ఇది ఉత్తమొత్తమమైనది అవాలి ఇక్కడ ఎప్పుడు మహోదయం కావాలి ‘అని కోరాడు సరే నన్నాడు భవుడు.శివుని పరి పరి విధాల స్తోత్రం చేశాడు .ఎక్కడ యముని భయం ఉండదో ,ఎక్కడ గర్భ నరకం ఉండదో అదే కాశి ..అని స్కందుడు అగస్త్య మహర్షికి చెప్పాడు .’’నేను యువకుడిని .నాకు మరణం చాలా దూరంఉంది .
మృత్యువు గురించి నాకు ఇప్పుడే విచారం ఎందుకు ?/అను కొనే వాడికి యముడి దున్న పోతు ఘంటా రావం విని పిస్తుంది .శరీరం మీద ఆసక్తి దూరం చేసుకొన్న వాడికి, శివుని పై దృఢ చిత్తం తొ ఉన్న వాడికి శివ పురి నివాసం కల్గుతుంది ..

 పుణ్యం, దానం, జపం, తపం వల్ల కాశీవాసం అందరికీ లభించదు. కేవలం పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటేనే
 కాశీ క్షేత్రవాసం కలుగుతుంది.


కాశీక్షేత్రం బ్రహ్మ సృష్టి కన్నా విభిన్నమైనది. క్షేత్ర మహిమని పరమేశ్వరుడు సైతం సంపూర్ణంగా వర్ణించలేడు. సంపదలు, శరీరం ఎప్పటికైనా నశించి పోయేవే. ఆయువు చంచలమైనది. అది ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలీదు. ఈ విషయాన్ని గుర్తించి అందరూ కాశీ క్షేత్రాన్ని ఆశ్రయించాలి. మరణం వచ్చే వరకూ కాశీని విడచి రాకూడదు. పాశుపతయోగం కన్నా, ప్రయాగ తీర్థం కన్నా జీవులకి అనాయసంగా ముక్తినిచ్చే క్షేత్రం కాశీ. 

కాశీ క్షేత్రంలో ప్రాణాలు విడిచినవాడికి మాత్రమే విదేహ విముక్తి కలుగుతుంది. కానీ ఇతర ప్రదేశాల్లో మరణిస్తే రాదు.


ఈ కారణం వల్లనే కాశీక్షేత్రం పవిత్రమైనది. విశ్వనాథుడికి ప్రియమైనది.  ఇంద్రియనిగ్రహంతో మూడురోజులు కాశీ క్షేత్రంలో నివసించిన వారి పాద రేణువులు ఎక్కడ పడితే ఆ ప్రాంతమంతా పవిత్రమై పోతుంది.


ఆనంద వనం - -అవిముక్తం కాశీక్షేత్రానికి అవిముక్తం ఆనందవనం అనే రెండు పేర్లున్నాయి.

ఈ నగరం అయిదుక్రోసుల పరిమాణంలో ఉంటుంది. పవిత్రమైన ఈ కాశీక్షేత్రాన్ని పార్వతీ పరమేశ్వరులు ప్రళయకాలంలో కూడా విడిచిపెట్టరు. అందుకే దీనికి అవిముక్త క్షేత్రం అనే పేరు వచ్చినది.

భూమి, నీరు లాంటివి ఏమీ లేవి సమయంలో విహారం కోసం పరమేశ్వరుడు ఈ అవిముక్త క్షేత్రాన్ని నిర్మించాడు. ఈ దివ్యక్షేత్రం మోక్ష స్వరూపమైన ఆనందానికి హేతువు అవటం వల్ల మహాదేవుడు దీనికి ఆనందవనం అనే పేరు పెట్టాడు. తరువాత కాలంలో ఈ ఆనందవనమే అవిముక్తంగా ప్రసిద్ధి చెందింది.

బ్రహ్మ వాక్కు 
కాశీ అన్నిటి కంటే గొప్ప ముక్తి క్షేత్రం .ఈ క్షేత్రం ఈశ్వరుని త్రిశూలాగ్రంలో ,భూమికి ,ఆకాశానికి మధ్య ఉన్నది .ఇక్కడ ఎప్పుడూ కృత యుగమే .నిత్యం మహా పర్వదినమే .ఎప్పుడూ ఉత్తరాయణమే .ఎల్లప్పుడు మహోదయమే .కాశిని సృష్టించిన వాడు సాక్షాత్తు మహా శివుడు .కాశీ లో పాపం చేయరాదు ఇక్కడ తులా పురుష దానం లాంటివి చేసిన వారు సత్య లోక వాసులవుతారు .జప ,తప ,ధ్యానదుల వల్ల రాని మోక్షం కాశీ నివాసంతో ,కాశీలో మరణంతో కలుగుతుంది .అని బ్రహ్మ దేవుడు కాశీ క్షేత్ర మహాత్మ్యాన్ని వివరించాడు శివ శర్మకు...



 కాశీ ఖండం –28
వారణాసి మహిమ

అగస్త్యునికి కుమారస్వామి వారణాసి మహిమను వివరిస్తున్నాడు .ఇక్కడ ప్రయత్న,అప్రయత్న మరణం సంభ విస్తే ముక్తియే . .ఈ మణి కర్ణిక లోకి గంగ చేరింది .ఇది శ్రీ విష్ణువుకు చక్ర పుష్కరిణి .పరబ్రహ్మ నివాస క్షేత్రం భగీరధుడు రాజర్షి బాగీరధిని భూమి పైకి తెచ్చి తన పితా మహు లందరికి ఉత్తమ లోకాలను కల్గించాడు .ఇక్కడ బంగారం ఉద్భ వించింది .చక్ర పుష్కరిణి మణి శ్రవణం అనే పేరుతో పిలువబడుతుంది .మణి కర్ణిక లో గంగ చేరిన దగ్గర్నుంచి ఇది దేవతలకు నిత్య ఆవాసం అయింది .ఇక్కడ జ్ఞానంతో పని లేదు .గంగా స్నానం విశ్వనాధ దర్శనమే ముక్తి నిస్తుంది .యముడు మొదలైన వారు కూడా ఇక్కడి వారినేమీ చేయలేరు .అన్ని విఘ్నాలను పోగొట్టే వరుణా నది ఉంది..కాశీ కి దక్షిణం గా అసి నదికి ఉత్తరం గా వరుణా నదిని దేవతలు నిల్పి మోక్ష నిక్షేపం గా కాపాడు తున్నారు .

ఈ క్షేత్రం లో పడమరన వినాయకుడున్నాడు .ఈయన విశ్వనాదునికి రక్షకుడు .వినాయకుని అనుమతి లేని వారికి ప్రవేశం లేదు .పూర్వం దక్షిణ సముద్ర తీరాన సేతు బంధనం దగ్గర మాత్రు భక్తికల ధనుంజయుడు అనే వాడుండే వాడు .సన్మార్గంలో ధనం సంపాదించే వాడు .అర్ధులను సంతోష పెట్టే వాడు .వినయ సంపన్నుడు .విష్ణు పూజా దురంధరుడు గుణ సంపన్నుడు .సదాచార సంపన్నుడు .తల్లి ని విశేషం గా పూజించి సేవించే వాడు .శివ యోగి బోధ వల్ల అతనికి జ్ఞానం కలిగింది .తల్లి చని పోయింది ఆమె అస్తికలను భద్రం గా ఒక పెట్టెలోదాచి పెట్టి పూజలు చేసి కావడిలో దాన్ని కాశీ కి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేశాడు .ఇతరు లెవ్వరు పెట్టె ను ముట్టుకో కుండా జాగ్రత్త పడ్డాడు .దారిలోఒక అరణ్యం లో జ్వరం వచ్చి బాధ పడ్డాడు .కూలి వాడిని ఏర్పాటు చేసుకొని అతని తో పెట్టె మోయించాడు .

కాశీ కి చేరాడు .మోసే వాడినే కాపలా ఉంచి కావలసినవి కొనుక్కో వటానికి బజారు వెళ్లాడు .ఆ రాగి పెట్టె లో డబ్బు ఉంటుందని వాడు ఆశ పడ్డాడు .దాన్ని ఎత్తుకు పోయాడు .ధనుంజయుడు తిరిగి వచ్చి తెలుసుకొని బాధ పడ్డాడు .గంగా స్నానం విశ్వ నాద దర్శనం లేకుండా ఆ
 మోసగాడి ఇంటికి వెళ్లాడు .వాడు ఆ పెట్టె ను దారిలోనే బద్దలు కొట్టి అందులో అస్తికలే ఉన్నందున అక్కడే పారేసి పారి పోయాడు.
ఇంటికి వెళ్లి అతని భార్యను నిజం చెప్పమని ధనుంజయుడు కోరాడు ఆమె ఇంట్లో దాగి ఉన్న భర్తకు ఈ సంగతి చెప్పింది .ధనుంజయుడు అతడిని తీసుకొని ఆ ప్రదేశానికి చేరాడు .ఆ చోటును అంత పెద్ద అరణ్యం లో కని పెట్ట లేక హతాశుడై ఇంటికి తిరిగి వెళ్లి పోయాడు .

అందరికి చెప్పి ,వారు చెప్పిన ప్రకారం గయ కు వెళ్లి తల్లి శ్రాద్ధం పెట్టాడు .ప్రయాగ లో త్రివేణీ సంగమ స్నానం చేశాడు .తరువాత కాశీ కి వచ్చి తల్లి అస్తికలను గంగలో కలిపితే విశ్వేశ్వరా నుగ్రహం లేక పోవటం వల్ల నెట్టి వేయ బడ్డాయి .శ్మ అంటే శవం .శాన అంటే శయ నించేది .అంటే శవం శయనించేది కనుక కాశి కి మహా శ్మశానం అని పేరొచ్చింది .అంటే ప్రళయ కాలం లో సమస్త భూత జాలం శవం పై ఈ మహా క్షేత్రం లో శయనిస్తుంది అని అర్ధం .కనుకనే మహా శ్మశానం అయింది .ప్రళయ కాలం లో ఈశ్వరుడు ప్రతి నిత్యం కాశీ నగరాన్ని  త్రిశూలం పై ఉంచి రక్షిస్తూ ఉంటాడు .అందుకే కాశీ కి ప్రళయ భయం లేదు .కాశి కలి కాల వర్జిత మైనది .దీనిని కాశి ,అని ,వార ణాసి అని ,రుద్రా వాసమని ,మహాశ్మశానమని ,ఆనంద కాననం ,దేవీ పురమని అంటారు .

కాశీ ఖండం –29.
కాల భైరవుడు

కాల భైరవ ప్రాదుర్భవాన్ని గురించి అగస్త్యునికి కార్తికేయుడు వివరించాడు .పూర్వం మేరు శృంగం లో బ్రహ్మ దేవుడు ఏకాంతం గా తపస్సు చేస్తున్నాడు. మహర్షులు ఆయన దగ్గరకు వెళ్లి ఏకాంతంగా ఏమి చేస్తున్నావని ప్రశ్నించారు .దానికి బ్రహ్మ ‘’నేను దాతను విధాత ను జగత్తును సృష్టించి ,పెంచి లయం చేస్తుంటాను . స్వయంభువున్ని .సర్వేశ్వరుడిని  జగాలన్ని నా అధీనం .నా కంటే గొప్ప దేవుడు లేదు ‘’అని ప్రగల్భాలు పలికాడు .అప్పుడు నారాయణఅంశ తో వచ్చిన 
క్రతువు బ్రహ్మ తో‘’పర తత్వాన్ని తెలుసుకోకుండా అజ్ఞానం తో మాట్లాడుతున్నావు ..నేనే కర్తను ,నారాయణుడిని , యజ్ఞ స్వరూపుడను .’’అన్నాడు ఇద్దరికీ వాగ్వాదం జరిగింది .చతుర్వేదాలలో ప్రవీణులైన విప్రులను సాక్షు లు గా ఉంచుకొని వాదు లాడుకొన్నారు .వేదాలలో ఏమి చెప్ప బడిందో తెలియ బర్చమని వారిద్దరూ కోరారు .వేదాలే తమకు ప్రమాణం అని తెలియ జేశారు .ఋగ్వేదం ‘’ఈ సకల భూత గణం ఎక్కడి నుంచి వచ్చి ,మళ్ళీ ఎక్కడికి చేరుతుందో అదే పర తత్త్వంఅయిన రుద్రుడు ‘’అన్నది.
 యజుర్వేదం ‘’ఎవరు యజ్ఞాధి పతి యో ,యోగం చేత అర్చింప బడే వాడేవ్వడో, ఎవరు అందరికీ ప్రమాణమో ఆయనే సర్వజ్ఞుడైన శివుడు ‘’అని చెప్పింది.
సామ వేదం’’ఎవరి చేత విశ్వ భ్రమణం జరుగు తోందో ,యోగులెవరిని గూర్చి చిన్తిస్తారో ,ఎవని కాంతి చే ఈ విశ్వం ప్రకాశిస్తుందో ఆయనే పరమ శివుడైన న త్రయంబకుడు ‘’అన్నది .
అధర్వణ వేదం ‘’దేవేశ్వరుడేవడో ,కైవల్య స్వరూపుడేవ్వడో అతడే దుఃఖ హారి అయిన శంకరుడు‘’అని చెప్పింది .

అప్పుడు బ్రహ్మా క్రతువు లిద్దరూ శ్మశానం లో విభూతి పూసుకొని దిగంబరం గా తిరిగే వాడూ ,ఎద్దునేక్కి తిరిగే వాడు సర్ప భూషణుడు ఎలా బ్రహ్మత్వం పొందుతాడు అన్నారు . అప్పుడు సనాతన ప్రమాణం అమూర్తి అయినా మూర్తి మత్వాన్ని పొంది నవ్వుతు ‘’పరమేశ్వరుని తెలుసు కోవటం కష్టమైన పని .లీలా రూపం తో నాట్యమాడుతాడు .ఆయన స్వయం జ్యోతి ,సనాతనుడు ,ఆనంద స్వరూపుడు ‘’అని చెప్పింది .అయినా బ్రహ్మ అజ్ఞానం నాశనం కాలేదు .అప్పుడు ఒక జ్యోతి వారి ముందు ప్రత్యక్ష మైంది .అది భూమ్యాకాశాలను ఆక్రమించింది ..జ్యోతిర్మండల మైన పురుషాకారంతో అది బ్రహ్మ కున్న ఐదో శిరస్సు ను తగుల బెట్టింది .తరువాత ఆజ్యోతి శివ రూపం చెంది ప్రత్యక్షమై నాడు. .బ్రహ్మ అహంకారం చావలేదు ‘’పూర్వం నువ్వు నా ఫాలభాగం నుండి పుట్టావు .నన్ను శరణు వేడు నేను నిన్ను రక్షిస్తా‘’అని గర్వం గా అన్నాడు .అప్పుడు కోపంతో ఒక భైరవా కారాన్ని శివుడు తన నుంచి సృష్టించాడు .

శివుడు కాల భైరవునితో  ‘’నువ్వు ఈ ప్రపంచాన్ని భరించే శక్తి కల వాడివి .నిన్ను ‘’పాప భక్షకుడు ‘’అని పిలుస్తారు కాశీలోనే నీ ఉనికి.
కాలమే నిన్ను చూసి భయ పడే కాల భైరవుడివి .’’అన్నాడు అప్పుడు భైరవుడు తన ఎడమ చేతి బొటన వ్రేలి తో బ్రహ్మ ఐదో తలను గిల్లి వేశాడు .భయ పడిన బ్రహ్మ శత రుద్రీయాన్ని పఠించాడు .
శివుడు బ్రహ్మను ఓదార్చి
 కాలభైరవుని తో ‘’నువ్వు యజ్ఞాలలో మాన్యత్వాన్ని పొందుతావు .బ్రహ్మ కపాలాన్ని చేతి లో ధరించి ,బ్రహ్మ హత్యా దోషం పోవటానికి తపస్సు చెయ్యి .’’అని చెప్పాడు .

 శివుడు బ్రహ్మ హత్య అనే పేరుకల కన్య ను సృష్టించాడు .ఆమె ఎర్రనిది. యెర్రని వస్త్రాలు యెర్ర చందనం ధరించి కోరలతో కూడిన విశాల మైన నోటితో  వ్రేలాడే నాలుక తో 
ఒక కాలు పైకెత్తి రక్త పానం చేస్తూ ఖడ్గం రక్త పాత్ర ,తల పుర్రె చేతుల్లో ధరించి అందర్ని భయ భ్రాంతులను చేసింది .శివుడు కాల భైరవునితో ‘’నువ్వు అన్ని ప్రదేశాలలో తిరిగే అధికారం కల వాడివి .ఈమె తొ నీకు కావాల్సిన పని చేయించుకో ‘’అని చెప్పి అంతర్ధానమయ్యాడు .

కపాల పాణియై ,కాపాలికా వ్రతము ధరించి భైరవుడు త్రిలోక సంచారి అయినాడు .కాశీ లో కాల భైరవుడు నిరంతరం సంచరిస్తూ ఏ దోషాలు రాకుండా కాపాడుతాడు .అన్ని కోరికలను తీరుస్తున్నాడు  భైరవుడు కాశీ లో ప్రవేశించగానే ‘’బ్రహ్మ హత్య ‘’భయపడి పాతాళ లోకానికి పారి పోయింది .

కాశీ ఖండం –30

 

 






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్యాకేజీ యాత్ర @17000/-

మహాలయ పక్షము 2025

🙏 దక్షిణ భారత తీర్థ యాత్ర 🙏 ప్యాకేజ్ @17300/-