వారాహి అమ్మవారు

కాశీలో ఉగ్రవారాహీఅమ్మవారి దేవాలయం ఉంది.
ఇక్కడ అమ్మవారు దక్షిణ ముఖి మరియు దక్షిణ కాలిగా పూజించ బడుతున్నది. శత్రు భయంకరి.
భూగృహంలో ఉన్న ఉగ్రవారాహీ అమ్మ వారిని దర్శించాలి.
భూగృహంలో ఉన్న వారాహిదేవి విగ్రహం పురాతనమైనది చాలా పెద్దది స్వయంభూ అమ్మవారు. మందిర ప్రధాన పూజారి మాత్రమే భూగృహంలో ఉన్న అమ్మవారికి అభిషేకం అర్చనలు పూజలు స్వయంగా చేస్తారు.
భక్తులను ఉదయం 4గంటల నుండి 10గంటల వరకు దర్శనమునకు అనుమతిస్తారు . ఆలయ పై భాగంలో ఉన్న రెండు గూనల ద్వారా అమ్మవారిని దర్శించాలి. ఒక వైపు నుండి అమ్మవారి ముఖం, రెండో వైపు నుండి అమ్మ వారి పాదాలను దర్శిస్తాము.
తదేక దీక్షతో చూస్తే రెండో గూన నుండి అమ్మవారి పూర్ణ రూపం దర్శించవచ్చు.
వారాహి అమ్మవారిని దర్శించుకున్న భక్తుల బాలారిష్ట దోషాలు తొలగి పోతాయి.
పురాణ కథల ప్రకారం సప్తమాతృకలు.
1 బ్రాహ్మి
2 మహేశ్వరీ
3 కౌమారి
4 వైష్ణవి
5 వారాహి రాత్రి వేళల్లో మాత్రమే పూజలందుకునే దేవత
6 ఇంద్రాణి
7 చాముండి
వీరు దుష్టశిక్షణ శిష్టరక్షణ కొరకు లలితా పరా భట్టారిక అమ్మవారితో యుద్దములో పాల్గొన్నారు.
వారాహి దేవి శక్తివంతమైన దేవత శౌర్యం, బలం మరియు ధైర్యములను భక్తులకు ప్రసాదిస్తున్నది.
వారాహిదేవి కాశీ క్షేత్రపాలకురాలు, కాశీ నగరానికి గ్రామ దేవత లలితా పరా భట్టారిక అమ్మవారికి సర్వసైన్యాధ్యక్షురాలు. రాత్రి సమయములలో కాశీక్షేత్రము నలువైపులా తిరుగుతూ కాపల కాస్తుంది, తెల్లవారు జామున గుడికి తిరిగివచ్చి నిద్రిస్తుంది/ విశ్రాంతి తీసు కుంటుంది. ప్రతిరోజు రాత్రి అంతా కాపలా కాచి తెల్లవారు జామున మందిరానికి వచ్చిన వెంటనే అభిషేకం, పూజ, అర్చన ఇత్యాదులు గావించి, ధూపదీప నైవేద్యములు పెట్టి, అమ్మను శాంతింప జేసి విశ్రాంతి కలుగచేస్తారు. వారాహీదేవి దర్శనం :
మందిరములోని కుడివైపు కన్నంలోనించి అమ్మవారి పాదాలు , ఎడమవైపు ఉండే కన్నంలోనుండి అమ్మవారి ముఖమును దర్శించవచ్చును.
వారాహి దేవికి శక్తులు చాలా ఉన్నాయి.
రక్షణ: వారాహి దేవి తన భక్తులకు ప్రతికూల శక్తులు మరియు దుష్ట శక్తుల నుండి రక్షణ కల్పిస్తుంది.
సంపద: వారాహి దేవిని ప్రార్థించడం వల్ల జీవితంలో సంపద మరియు శ్రేయస్సు లభిస్తుంది.
ఆరోగ్యం: వారాహి దేవి ఆరోగ్యంతో పాటు తన భక్తుల వ్యాధులను నయం చేయడమే గాక అనారోగ్యాల నుండి రక్షిస్తుంది.
ధైర్యం: శౌర్యం మరియు శక్తికి చిహ్నంగా, వారాహి దేవి తన భక్తులకు ధైర్యం మరియు విశ్వాసాన్ని ప్రసాదిస్తుంది.
జ్ఞానం: వారాహి దేవిని ఆరాధించడంజ్ఞానం పెరుగుతుంది.
ఆధ్యాత్మిక వృద్ధి: వారాహీ దేవి భక్తి ఆరాధన పూజ ఇత్యాదులు ఆధ్యాత్మిక వృద్ధికి మరియు జ్ఞానోదయానికి ఉత్తమ మార్గములు అధ్యాత్మిక వృధ్ధి మనోబలం శత్రు నాశనం అరిషడ్వర్గాల నుండి రక్షణకు పరమ సోపానము.
సంతానోత్పత్తి: వారాహి దేవత సంతానం మరియు గర్భం ధరించాలని కోరుకునే దంపతులు తప్పక పూజించవలసిన అమ్మవారు. సంతానర్తులు పూజించండి. దోష పరిహారం అవుతుంది.
వారాహి దేవి తన భక్తులకు అడ్డంకులను అధిగమించి వారి లక్ష్యాలను సాధించడంలో సహాయపడే శక్తివంతమైన అనుగ్రహ ప్రదాయిని.
దేవీ మాహాత్మ్యంలోని జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షశుడిని, అతని సేనను సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే, ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుడ్ని సంహరిస్తుంది. వామన పురాణాం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది.
వారాహి అమ్మ వారిని
సప్త మాతృకలలో ఒకరు మరియు మాత్రకులలో ఐదవ వారు. వారాహి అమ్మ వారు లలితా పరా భట్టారికకు సర్వ సైన్యాధ్యక్షురాలు వరాహ పంది ముఖం కలిగిన అమ్మవారు.
నేపాల్ లో వారాహి అమ్మను బారాహి అని అంటారు.
యుద్ధం లో మాయ అసుర శక్తి సకల దేవతలను మూర్చితులను శక్తి హీనులను ఇంకా మరోసారి అచేతనులను ఇంకా మరోసారి బుద్ది హీణులను చేసినా వారాహి అమ్మవారి మీద మాత్రమే ఎటువంటి అసుర రాక్షస శక్తి పారలేదు. వారాహి యుద్ధంలో ఆఖరి వరకు పోరాడుతుంది.
మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి, వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును. వారాహి అమ్మ బర్రెను వాహనంగా చేసుకుందని తెలపబడి ఉంది.
రక్తబీజుడిని చంపడం కోసం దుర్గా దేవి సప్త మాతృకలతో కలిసి పోరాడుతుంది. ఆ విధంగా అష్టమాతృకలు అయ్యారు.
వారాహి అమ్మ వారిని వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి