ప్యాకేజీ యాత్ర @11000/-
మహానుభావులు, ఋషులు, అఘోరాలు,పండితులు, పామరులు, దేవతలు, భూతములు, అసురులు, పితృదేవతలు, గాణాపత్యులు,శైవులు, శాక్తేయులు, సౌరమానులు, వైష్ణవులు, సాధకులు, సాధువులు, ఇలా సకల జగత్తు సేవించుకునే దర్శించుకునే పరమపావన పుణ్యక్షేత్రం కాశీపురి.
ఆధునిక నేటి కాలమానములో వారణాసిగా పిలవబడుతున్న కాశీ రాజ్యము ఇంకా కాశీపురి అనబడే కాశీ నగరమునకు స్వాగతము.
II హర హర మహాదేవ II
సంపూర్ణ ఉత్తరభారత కాశీ యాత్ర
👇👇కాశీ ప్యాకేజీ యాత్ర ప్రత్యేకతలు 👇👇
మీకు దేవాలయముల గురించి వివరిస్తూ ఉండే గైడ్ తెలుగు గైడు యాత్ర ప్రారంభం నుండి యాత్ర పూర్తయ్య వరకు అందుబాటులో ఉంటారు.
శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి స్పర్శ దర్శనము ఈ ప్యాకేజీలో ఉచితంగా చేయించబడును
ఒకరోజు బోటు లో అనగా నావలో గంగాహారతి చేయించబడును
మరి ఒకరోజు అంటే ఒక ప్రత్యేకమైన రోజున ప్రత్యేకమైన సమయం అంటే మధ్యాహ్నం అపరాన్న వేళ పడవ ద్వారా మణికర్ణికా స్నానమునకు తీసుకువెళ్తాము.
అన్నపూర్ణ దేవాలయంలో గర్భాలయ ప్రవేశం ఉంటుంది.
విశాలాక్షి అమ్మవారి దేవాలయంలో విశాలాక్షి అర్చిత ప్రసాదం ఇవ్వబడుతుంది.
ప్రతిరోజు రేపటి కార్యక్రమ డే ప్లాను అంటే దినచర్య వివరించబడుతుంది.
కాశీ క్షేత్రములో
నడచి మరియు వాహనముల ద్వారా చూసే ఆలయముల వివరములు.
1. కాశీ విశ్వనాధ మందిరము
2. కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారు
3.కాశీ విశాలాక్షి మందిరము.
4. 64 ఘాట్ల సందర్శనము.
5.గంగా హారతి.
6.చింతామణి గణపతి ఆలయం.
7.కేదారేశ్వర మందిరము.
8.తిలాభాండేశ్వర మందిరము.
9. శ్రీ రాజరాజేశ్వరి ఆలయం {శ్రీ చక్ర నిలయం}.
10.వారాహి మందిరము.
11.కాలభైరవ ఆలయం.
12.సారనాథ్ బుద్ధ మందిరము.
13. వ్యాస కాశీ {కాశీ రాజు గారి కోట.}
14.బిర్లా మందిరము. {విశ్వనాధ మందిరం}
15.సంకటమోచన హనుమాన్ మందిరము.
16.తులసీ మానస మందిరం.
17.దుర్గా మందిరము.
18.కౌడీ బాయ్ {గవ్వలమ్మ గుడి}.
గర్భా వాస దోష నివృత్తి కొరకు ప్రతి వారు పది నెలల కాశీ వాసము చేయదగినది.
కాలక్రమంలో పది నెలల కు బదులుగా సూక్ష్మ విధానంలో సకల జనులు ఆమోదయోగ్యమైన రీతిలో నేటి కాలమాన పరిస్థితుల్లో సమయాభావం చేత తక్కువ సమయం కలిగిన వారందరూ పది రోజులు తొమ్మిది నిద్రలు కాశీ వాసముతప్పనిసరిగా చేస్తున్నారు.
ఈ ప్యాకేజీ యాత్రలో ఐదు రోజులు యాత్ర నిర్వహింప చేయడం జరుగుతుంది
యాత్రలో భాగంగా ఒకరోజు ప్రయాగ రాజము అనబడే త్రివేణి సంగమము (అలహాబాదు)
మరియు ఇంకొక రోజున అయోధ్య శ్రీ రామ జన్మభూమి దర్శనములు చేయిస్తాము ఈ క్షేత్రములు కాశీ నుంచి ఒక క్షేత్రం ప్రయాగ రానుపోను 300 కిలోమీటర్లు అయోధ్య 460 కిలోమీటర్లు గా ఉంటుంది ఇట్టి క్షేత్ర సందర్శన యాత్రలో ఒకరోజు ప్రయాగ మరియు సీతామడి దర్శనములు ఉంటాయి. ఇంకొక రోజు అయోధ్య దర్శనం ఉంటుంది
మేము ప్యాకేజీ ద్వారా 5 రోజులకు గాను కాశీలో ఐదు నిద్రలు ఆరు రోజుల యాత్రగా ఉంటుంది . ఉదయము టిఫిను మధ్యాహ్నము భోజనము రాత్రికి టిఫిను సహితంగా అకామిడేషన్ అనగా వసతి అనగా నాన్ ఏసీ రూముల తో ఎయిర్పోర్టు లేదా వారణాసి రైల్వే స్టేషన్ నుంచి రిసీవింగ్ మరియు డ్రాపింగ్ ల తో పాటు పైన వివరించబడిన అలహాబాద్ ప్రయాగరాజ్ అనబడే త్రివేణి సంగమము మరియు అయోధ్య మరియు కాశీలో లోకల్ సైట్ సీయింగ్ నడిచి చూసే గుళ్ళ సహితంగా సీతామడి లతో కలిపి ట్రావెలింగ్ ఫుడ్డు అకామిడేషన్ అన్నీ కలుపుకొని ఒక వ్యక్తికి ఐదు నిద్రలు ఆరు రోజుల రోజుల ప్యాకేజీ 11వేల రూపాయలకు అందించడం జరుగుతుంది మీరు ఇంటికి వెళ్లేటప్పుడు మీకు భోజనము అంటే మార్గంలో తినడానికి పార్సీలు ఇవ్వబడుతుంది.
ll అయోధ్య ll
ll శ్రీరామ జన్మభూమి. ll
అయోధ్యలో చూడదగిన ప్రదేశములు...........
మొదట సరయూ నదీ స్నానము.
1.శ్రీ రామ జన్మభూమి
2.హనుమాన్ గుడి.
దీన్నే హనుమాన్ గడి అని కూడా అంటారు.
అదేవిధంగా
3. శ్రీరామ పట్టాభిషేకం జరిగిన ప్రదేశము.
4. సీతమ్మ వంట శాల దీన్నే పాకశాల అని అనవచ్చు.
5. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసిన ప్రదేశం.
6. ఇంకా రాముడు నడయాడిన అనేక ప్రదేశములను ఇక్కడ చూడవచ్చును.
త్రేతాయుగంలో రాముడు భరతావనిని పరిపాలించిన భారత రాజధాని.
రఘు రాముడు నడయాడిన పవిత్ర భూమి.
శ్రీ రామ నామం అమృతం వలె ప్రతిధ్వనించిన అమృతమయ మయిన నేల...............
II శ్రీరామ శ్రీరామ శ్రీరామ II
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ll ప్రయాగరాజము త్రివేణి సంగమము ll
అలహాబాదు కుంభమేళా జరుగు ప్రదేశం.అలహాబాదులో దర్శించ తగిన ప్రదేశములుగంగా యమునా సరస్వతి సహిత త్రివేణి సంగమము.అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మాధవేశ్వరి శక్తి పీఠం.బడా హనుమాన్ అని పిలువబడే హనుమాన్ మందిరము.నెహ్రూ గారి ఇల్లు ఆనంద్ భవన్ గా ప్రసిద్ధి చెందినది.త్రివేణి సంగమం వద్ద యాత్రికులు అందరూతమ యాత్రలో భాగంగామన మన లేక తమ తమ పెద్దలైనపూర్వీకుల అందరికీశ్రద్ధతో శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు.త్రివేణి సంగమమునకుదంపతులుగా దర్శనార్థులుగా వచ్చిన దంపతులువేణి దానము అనగా దంపతులుగా చేసే వేణీ పూజ చేయించుకుంటారు.మాధవేశ్వరి అమ్మవారికిఒడిబియ్యం పోయడం మన తెలుగు వారి సంప్రదాయం.
సీతా మడి
సీతా మడి లేక సీతా మర్హి అన్న పేర్లతో పిలువబడే సీతా మడి దర్శనీయ స్థలం.
సీతా మడి దగ్గర అతి పెద్దదయిన ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది.
రామాయణ గాథ లో చెప్పబడిన విధంగా........
వాల్మీకి మహాముని ఆశ్రమము గంగానది ఒడ్డున ఇక్కడే ఉండేది ఇక్కడే లవకుశులు జన్మించారు. ఇక్కడే సీతమ్మ తల్లి అవతార పరిసమాప్తి చేసినారు.
సీతమ్మవారు భూమి లోపలికి ప్రవేశించిన ప్రదేశాన్ని ప్రస్తుతం
సీతా మడి గా పిలుస్తారు.
సాధారణంగా యాత్రికుల అందరికీ చూపించ తగిన చూడవలసిన యాత్రను పూర్తి చేయిస్తాము.
పురాణములు స్కాంద పురాణము మరియు కాశీఖండము ప్రకారంగా కాశీలో తొమ్మిది నెలల తొమ్మిది రోజుల తొమ్మిది ఘడియలు అనగా పది నెలల కాశీ వాసము ప్రతివారు దంపతులు పూర్తి చేస్తారు లేదా అంటే దంపతులుగా లేని వారు ఒక్కొక్కరుగా అయినా సరే ఈ కాశీవాసమును పూర్తి చేస్తారు.
🙏 హర హర మహాదేవ శంభో శంకర 🙏
అయితే కాలక్రమంలో గర్భవాస దోష నివృత్తి కొరకు పది నెలల కాశీ వాసము చేయవలెనని ఉన్నప్పటికీ కాలక్రమంలో ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రతి వారు కనీసం పది రోజులు పూర్తి చేస్తున్నారు.
ఈ విధంగా గర్భవాసం దోష నివృత్తి కొరకు పది నెలల
కాశీ వాసము గడప వలెను.
ఈ విధంగా చేయదగిన యాత్ర కొరకు ఒక లఘు యాత్ర
5 నిద్రలు 6 రోజుల కాశీ వాసము తో కూడిన
పూర్తి యాత్రను ప్యాకేజీగా చేయిస్తున్నాము
మేము కాశీలో వసతి భోజనము ఇంకా ప్రయాణ సాధనాలు అన్నిటినీ కల్పిస్తున్నాము అయితే మీరు కాశీకి ట్రైన్ ద్వారా సొంత వాహనాలు లేదా ఫ్లైట్ ఏ విధంగా చేరుకున్నప్పటికీ కాశీలో
5 నిద్రలు 6 రోజులకు సంబంధించిన పూర్తి యాత్రను మేము ప్యాకేజీలో అందిస్తున్నాము
యాత్రలో జాగ్రత్తలు సూచనలు మరియు కొన్ని పద్ధతులు
యాత్రకు వచ్చే భక్తులు యాత్రలో భాగంగా అధిక ధనము అంటే ఎక్కువ లిక్విడ్ క్యాష్ దగ్గర ఉంచుకోరాదు. మన అవసరాలకి తగినంత డబ్బును మాత్రమే దగ్గర ఉంచుకోండి.
యాత్రలో సులభంగా ధరించగలిగే సాంప్రదాయ వస్త్రములను అనగా దేవాలయములలో వెళ్లటానికి అనుకూలంగా ఉండే సాంప్రదాయ వస్త్రములను ధరించండి
పండ్లు
ఇట్టి తీర్థయాత్రలో సహజంగానే ఆపిల్ పండ్లు
జామ పండ్లు మొదలగు ఫలములు తక్కువ ధరలో దొరుకుతాయి కాబట్టి యాత్రికులు వీటిని తినడానికి ఇష్టపడతారు కావున వెంట ఒక చాకు ఉంచుకోవలెను
తినే పండ్లను కట్ చేసుకోవడానికి.
దేవాలయాలకు వెళ్లి నప్పుడు
శివలింగానికి అభిషేకం నిమిత్తము
గంగా స్నానానికి వెళ్ళినప్పుడు
గంగా స్నానం కోసం
ఒక రాగి చెంబు వెంట ఉంచుకోగలరు.
ఆన్లైన్ పేమెంట్ల కోసము పేమెంట్ ఆప్షన్లు లేదా ఏటీఎం కార్డులు దగ్గర ఉంచుకోండి
అందరూ తప్పనిసరిగా మీ మీ ఐడి కార్డులు అనగా మీ ధ్రువీకరణ పత్రము ఆధార్ కార్డు వంటివి ఏవైనా జిరాక్స్లు కొన్ని మరియు ఒరిజినల్ కూడా క్యారీ చేయండి
దేవాలయ దర్శనాలకు వెళ్లినప్పుడు దేవాలయానికి సంబంధించిన రుసుములు టికెట్లు వగైరాలు అన్ని యాత్రికులే భరించుకోవాలి.
నిర్వాహకులు ట్రావెలింగ్ భోజనము వసతి గైడింగు ఏర్పాటు చేస్తారు.
కొత్త వాళ్ళు ఇచ్చే ఆహార పదార్థాలు ప్రసాదాలు
ఏమైనా సరే జాగ్రత్తగా చూసి తినండి
ఏదైనా అనుమానంగా ఉంటే మన రూమ్ కి వచ్చినాక జాగ్రత్తగా పరిశీలించి తినండి.
యాత్రికులకు మత్తు పదార్థాలు తినే పదార్థాల్లో కలిపి ఇచ్చి తరచుగా మోసగిస్తూ ఉంటారు జాగ్రత్త.
తప్పనిసరిగా అందరూ జాగ్రత్తగా ఉండాలి.
యాత్రీకులు వెంట యాత్రికుల మాదిరిగా
పలు ప్రాంతాల వాళ్ళు దొంగలు కూడా ప్రయాణిస్తుంటారు.
దొంగలు రద్దీ
ప్రాంతాల్లో ప్రయాణిస్తున్న యాత్రికులను టార్గెట్ చేస్తారు.
అన్ని చోట్ల మన వాళ్లు అందుర ఒక గ్రూపు గా ఉండండి.
జాగ్రత్తగా ఉండమని చెప్పడం మా ఉద్దేశం.
ఉత్తర భారత సంపూర్ణ కాశీ యాత్రలో భాగంగా
యాత్రికులు
తమ తమ ఇంటి నుండి తెచ్చుకో వలసిన వస్తువులు.
ప్రయాగ రాజములో మాధవేశ్వరీ,
కాశీలో విశాలాక్షి,
కాశీలో అన్నపూర్ణేశ్వరి,
అమ్మవార్లకు ఒడిబియ్యం సామాను.
తీర్థయాత్రలో ఖర్చులకు గాను
పది రూపాయల నోట్లు
5 రూపాయల కాయిన్స్
పెద్ద ఒక రూపాయి బిళ్ళలు దక్షిణ కొరకు.
ఇక్కడ పది రూపాయల కాయిన్స్ చెల్లుబాటు అవుతాయి. ఇక్కడ అంటే కాశీలో చిన్న రూపాయి బిళ్ళలు చెల్లుబాటు అవడం లేదు.
భక్తులు ఎవరూ కూడా బంగారు ఆభరణములు లేదా విలువైన ఆభరణములు ధరించి రాకూడదు. అన్నిచోట్ల దొంగలు ఉండే ప్రమాదము అధికంగా ఉంటుంది.
భక్తులు దర్శనాలకు వెళ్తున్నప్పుడు దర్శనముల కొరకు ఉండే టికెట్లు గాని అభిషేకాలు పూజలు దానధర్మముల కొరకు ఎవరి ఖర్చుల కొరకు వారు డబ్బులు తెచ్చుకోవలెను. దేవాలయాల్లో అక్కడక్కడ ఉండే టికెట్లు దర్శనానికి ఉండే రుసుములు అన్ని యాత్రికులే భరించుకోవలెను.
కాశీ యాత్ర లో పది రూపాయల కాయిన్స్
చెల్లుబాటు అవుతాయి.
దేవాలయాలకు వెళ్లినప్పుడు దేవతా కార్య క్రమాలకు
పితృ కార్యములకు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు
సంప్రదాయ వస్త్రాలు ధరించాలి.
ప్రయాగ రాజము
అలహాబాద్ త్రివేణి సంగమం లో
వేణీ పూజ చేయించుకోవాల్సిన దంపతులు
నూతన వస్త్రములు ఒక జత దగ్గర ఉంచుకోండి.
మ్యూజియములు పార్కులు దేవాలయము ఇతరత్రా ప్రదేశములలో ఎంట్రీ టికెట్టు వీల్ చైర్ యొక్క ఖర్చులు అదనపు రుసుములు అనగా స్పెషల్ ఎంట్రీలు విఐపి ఎంట్రీలకు సంబంధించి గాని అయ్యే ఖర్చులు ఎవరికి వారే భరించుకోవాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి